స్వర్ణం గెలిచిన బాత్రా గోళ్లపై త్రివర్ణం, 'దేశభక్తి కాదు.. అతి భక్తి'

Posted By:
We are absolutely in love with Manika Batras tricolour nails at CWG 18 which are so patriotic

హైదరాబాద్: టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఇప్పుడో సంచలనంగా మారింది మనికా బాత్రా.. . కామన్వెల్త్‌ క్రీడ ల్లో బాత్రా సాధిస్తున్న ఒక్కో పతకంతో ఆమె పేరు మార్మోగుతోంది. ఇలాంటి మెగా ఈవెంట్‌లో ఒక్క పతకం వస్తేనే ఎంతో గొప్పగా భావిస్తాం. అలాంటిది బాత్రా అలవోకగా మూడు పతకాలు పట్టేసింది. అందులో రెండు స్వర్ణాలు.. ఒక రజతం ఉన్నాయి.

దేశభక్తితో పతకం నెగ్గేందుకు.. కలను నెరవేర్చుకునేందుకు..

దేశభక్తితో పతకం నెగ్గేందుకు.. కలను నెరవేర్చుకునేందుకు..

అమితమైన దేశభక్తితో ప్రతీ పతకం నెగ్గేందుకు.. తన కలను నెరవేర్చుకునేందుకు.. తాపత్రయపడింది. ఆసీస్‌ గడ్డపై త్రివర్ణాన్ని రెపరెపలాడించేందుకు మనికా చేసిన పోరాటం అసాధారణమైనది. మరీ ముఖ్యంగా నాలుగు సార్లు స్వర్ణ విజేత, డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన సింగపూర్‌తో జరిగిన టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో సారథిగా జట్టును ముందుండి గెలిపించిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

 స్వర్ణం కోసం ఆఖరి వరకూ పట్టువిడవకుండా పోరాడి రజితం

స్వర్ణం కోసం ఆఖరి వరకూ పట్టువిడవకుండా పోరాడి రజితం

డబుల్స్‌ విభాగంలో మౌమా దాస్‌తో కలిసి ఫైనల్లో స్వర్ణం కోసం ఆమె ఆఖరి వరకూ పట్టువిడవకుండా పోరాడి రజితం దక్కించుకుంది. ఇప్పుడు సింగిల్స్‌ ఛాంపియన్‌గా నిలిచే క్రమంలో సెమీస్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ను ఓడించింది. . ఫైనల్లో తనకంటే మెరుగైన ప్లేయర్‌పై విజయం సాధించి.. స్వర్ణాన్ని సాధించింది.

 మూడు పతకాలతో బాత్రా కెప్టెన్సీ

మూడు పతకాలతో బాత్రా కెప్టెన్సీ

గత కామన్వెల్త్ క్రీడల్లో టేబుల్ టెన్నిస్ విభాగంలో ఖాళీ చేతుల్తో తిరిగొచ్చారు. అలాంటిది ఈ సీజన్‌కు మూడు పతకాలతో మెరిసిపోతున్నారంటే బాత్రా కెప్టెన్సీ అని చెప్పాలి. ఈ ఆట కోసం ఆమె మోడలింగ్‌ను కూడా పక్కన పెట్టేశారట. ఎందుకంటే.. ఈ ఆటన్నా.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమన్నా.. మనికాకు అంత ఇష్టం... ప్రాణం..!

చేతి గోళ్లపై త్రివర్ణాన్ని ముద్రించుకొని బరిలోకి:

చేతి గోళ్లపై త్రివర్ణాన్ని ముద్రించుకొని బరిలోకి:

దేశభక్తిని చాటుకునేలా చేతి గోళ్లపై త్రివర్ణాన్ని ముద్రించుకొని బరిలోకి దిగడం ఆమెకు అలవాటు. అయితే, ఇన్నాళ్లుగా పెద్దగా పట్టించుకోని క్రీడాభిమానులు.. స్వర్ణం గెలవడంతో ప్రత్యేక దృష్టి సారించారు. కామన్వెల్త్‌లో ఆమె చేతి వేళ్లపై త్రివర్ణాన్ని చూసి కొందరు ఆమె దేశభక్తికి శభాష్‌ అంటే.. మరికొందరు ఇది అతిభక్తి అంటూ ఎద్దేవా చేశారు. ఇంతటి అసామాన్యురాలి చేతి వేళ్లపై త్రివర్ణం మెరిసిపోతుందంటూ ఇంకొందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Story first published: Sunday, April 15, 2018, 13:53 [IST]
Other articles published on Apr 15, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి