వింటర్ ఒలింపిక్స్: తల లేని రోబోల పరుగు పందెం(వీడియో)

Posted By: Subhan
Robo_Rajini

హైదరాబాద్: మనిషి చేయలేని పనులను చేసేందుకు, వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లి వచ్చేందుకు రోబోలను ఉపయోగిస్తారు. కానీ, ట్రెండ్ మారింది సరదా ఆటలకు కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. తమ జీవితంలో ఒక్కసారైనా అతిపెద్ద క్రీడా సంరంభం ఒలింపిక్స్‌లో పాల్గొనాలనుకుని క్రీడాకారులు భావిస్తుంటారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అథ్లెట్లు, క్రీడాకారులతో పోటీ పడి పతకాలు గెలవాలనే కుతూహలంతో ఉంటారు.

 మనుషులకు బదులుగా:

మనుషులకు బదులుగా:

ప్రత్యమ్నాయాలు పెరిగిపోయిన తరంలో వంటచేసేందుకు, వార్తలు చదివేందుకు, విద్య, వైద్య, సైనిక రంగాల్లో సైతం రోబోల వినియోగం ఎక్కువైంది. ఇప్పుడు వీటిని ఉపయోగించి వింటర్ ఒలింపిక్స్‌కు పోటీపడుతున్నారు టెక్నాలజిస్టులు.

 అథ్లెట్లు పోటీపడే ఫీల్డ్‌లోకి వచ్చేశాయ్:

అథ్లెట్లు పోటీపడే ఫీల్డ్‌లోకి వచ్చేశాయ్:

ప్రస్తుతం ప్యాంగ్‌చాంగ్‌లో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో 85 రోబోలు సేవలందిస్తున్నాయి. డ్రింక్స్ అందించేందుకు, పరిసరాలను శుభ్రపరిచేందుకు, అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు, ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటకులకు గైడ్‌గానూ వీటిని వాడేస్తున్నారు. ఐతే వీటిలో కొన్ని రోబోలు మాత్రం అథ్లెట్లు పోటీపడే ఫీల్డ్‌లోకి కూడా వచ్చేశాయని కొరియా వార్తా సంస్థ ఒకటి వెల్లడించింది.

 ఎంతవరకు నిలబడతాయా అని:

ఎంతవరకు నిలబడతాయా అని:

వీటి మధ్య పోటీ కోసం నిర్వాహకులు ఏర్పాట్లు కూడా చేశారు. ఎంపిక చేసిన ఒక్కో రోబోకు (యార్డ్‌స్టిక్స్) స్కీయింగ్‌లో వాడే చేతికర్రలు అమర్చాం. అవి ఎంత స్థిరంగా ఉంటున్నాయి, వాటిని ఎలా వాడుకుంటున్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కొరియా అడ్వాన్స్‌డ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పార్క్ హ్యున్ తెలిపారు.

 ప్రాక్టీస్ చేసి వచ్చాయ్:

ప్రాక్టీస్ చేసి వచ్చాయ్:

చరిత్రలో తొలిసారిగా ఒలింపిక్స్ జరుగుతున్న వేదికకు సమీపంలోనే వచ్చే వారం వీటి మధ్య పోటీ నిర్వహించనున్నారు. కొన్ని పోటీపడేందుకు సాధ‌న కూడా చేస్తున్నాయి. 50సెంటిమీటర్ల ఎత్తైన‌ ప్రతీ రోబోకు కచ్చితమైన దిశానిర్దేశం చేశారు. రెండు కాళ్లు ముందుకు వంగేలా స్కీయింగ్ చేసేందుకు అనుగుణంగా డిజైన్ చేశారు.

మనుషులతో ఏ మేరకు పోటీ పడగలవో:

మరో విశేషమేంటంటే 2020 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న జపాన్ కూడా తాము నిర్వహించే క్రీడల్లో ప్రత్యేకంగా రోబోల కోసమే కొన్ని ఈవెంట్లలో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించడం విశేషం. మరి..రోబోలు మానవ అథ్లెట్లకు ఏమేరకు పోటీ ఇవ్వగలవో తెలుసుకునేందుకు కొద్దిరోజులు ఆగాల్సిందే.

Story first published: Thursday, February 15, 2018, 14:17 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి