న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్ష్యం టొక్యో ఒలింపిక్సే: 11 సెకన్లలో 100 మీటర్ల పరుగు

By Nageshwara Rao
Want to bring Dutees 100m timing under 11-second mark: Coach

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా గత ఆదివారంతో ముగిసిన 18వ ఆసియా గేమ్స్‌లో రెండు పతకాలు గెలవడం ద్వారా భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగత తెలిసిందే. ఈ ఆసియా గేమ్స్‌లో 100, 200 మీటర్ల రేసులో పోటీపడిన ద్యుతీ చంద్ రజత పతకాలు సాధించింది.

తద్వారా ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచింది. 1998 బ్యాంకాక్‌ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్‌ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించింది. 2002 బుసాన్‌ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో మెరిసింది.

టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉన్న కారణంగా

టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉన్న కారణంగా

ఇప్పుడు వారి సరసర ద్యుతీ చంద్ కూడా చేరింది. టెస్టోస్టిరాన్ స్థాయి ఎక్కువగా ఉన్న కారణంగా ఆమె "ఆడది కాదు మగాడు" అంటూ ఇంటర్నేషనల్ అథ్లెట్ అసోషియేషన్ ఆఫ్ ఫెడరేషన్ 2014 ఆసియా గేమ్స్ సమయంలో నిషేధం ఎదుర్కొన్న ద్యుతీచంద్ ఆ తర్వాత అంతర్జాతీయ క్రీడా న్యాయస్థానంలో పోరాడి మళ్లీ ట్రాక్‌పైకి వచ్చింది.

రెండు రజతాలతో సత్తా చాటిన ద్యుతీ చంద్

రెండు రజతాలతో సత్తా చాటిన ద్యుతీ చంద్

అందరి అంచనాల్ని అందుకుంటూ తొలుత 100 మీటర్ల రేసుని 11.32 సెకన్లలో ముగించి రజతం గెలిచిన ద్యుతీచంద్.. 200 మీటర్ల రేసుని 23.20 సెకన్లలో అందుకుని మరో రజతంతో భారత్‌ని మురిపించింది. ఏ వేదికపై అయితే తనని పోటీపడకుండా ఇంటర్నేషనల్ అథ్లెట్ అసోషియేషన్ ఆఫ్ ఫెడరేషన్ అడ్డుకుందో అదే వేదికపై రెండు రజతాలతో సత్తాచాటింది.

సంతోషంగా వ్యక్తం చేసిన ద్యుతీ చంద్ కోచ్

సంతోషంగా వ్యక్తం చేసిన ద్యుతీ చంద్ కోచ్

ఆసియా గేమ్స్‌లో ద్యుతీ చంద్ ప్రదర్శనపై సంతోషంగా వ్యక్తం చేసిన ఆమె కోచ్ నాగపురి రమేశ్, 2020 టోక్యో ఒలింపిక్స్‌‌లో ద్యుతీ చంద్ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన మాట్లాడుతూ "రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ ఆసియా గేమ్స్‌‌ 100 మీటర్ల రేసులో భారత స్ప్రింటర్ పతకం గెలవడం చాలా సంతోషంగా ఉంది" అని అన్నారు.

ఈ ఘనత అంతా ద్యుతీచంద్‌దే

ఈ ఘనత అంతా ద్యుతీచంద్‌దే

"ఈ రికార్డును బట్టే.. ఆ పోటీ ఎంత కఠినంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఘనత అంతా ద్యుతీచంద్‌దే. ప్రస్తుతం ఆమె ఆసియాగేమ్స్‌లో సాధించిన విజయాన్ని ఆస్వాదిస్తోంది. ప్రభుత్వం, ఫెడరేషన్‌ నుంచి ఆమెకి సహకారం లభిస్తోంది. మరికొంత మద్దతు లభిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌‌లో 100 మీటర్ల రేసుని 11 సెకన్లలోపే ఆమె పూర్తి చేయాలనేది మా లక్ష్యం" అని ఆయన అన్నారు.

Story first published: Wednesday, September 5, 2018, 12:24 [IST]
Other articles published on Sep 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X