న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాకు ఊహించని షాకిచ్చిన వాడా: 4 ఏళ్ల నిషేధం, టోక్యో ఒలింపిక్స్‌కు దూరం!

WADA executive committee bans Russia from Olympics, world championships for 4 years

హైదరాబాద్: ఒలింపిక్స్‌కు ముందు రష్యాకు ఊహించని షాక్ తగిలింది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రూల్స్‌ను అతిక్రమించినందుకు గాను రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించింది. తప్పుడు డోపింగ్‌ పరీక్షా ఫలితాలు, నిర్వహణతో రష్యా క్రీడా సమాఖ్య ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించుకుంది.

మాస్కోలోని ల్యాబోరేటరీల్లో నామమాత్రపు పరీక్షలు, నకిలీ నివేదికలు, నిర్వహణ తీరుపై విచారించిన 'వాడా' స్వతంత్ర దర్యాప్తు కమిటీ నివేదిక ఆధారంగా వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రష్యాపై నిషేధం విధించి శిక్షించాలని వాడా కమిటీ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని అధికార ప్రతినిధి తెలిపారు.

'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్

గ్లోబల్ స్పోర్ట్స్ పవర్‌గా తనను తాను ప్రదర్శించుకునే ప్రయత్నంలో రష్యా డోపింగ్ కుంభకోణాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో 2015లో రష్యాలో వ్యవస్థీకృత డోపింగ్‌ వ్యవహారం అంతర్జాతీయ క్రీడా సమాజంలో ఓ కలకలం సృష్టించింది. క్రీడల చరిత్రలోనే దీనిని ఓ అతిపెద్ద చీటింగ్ స్కాండల్‌గా అభివర్ణించింది.

అక్కడి క్రీడాధికారులు, కోచ్‌లు తమ క్రీడాకారులకు శిక్షణతో పాటు నిషేధిత ఉ్రత్పేరకాలు అలవాటు చేస్తున్నట్లు తేలడంతో 'వాడా' విచారణకు స్వతంత్ర దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ విచారణలో అధికారుల అండదండలతోనే ఇదంతా జరిగిందని తేలింది. ఈ క్రమంలో ర‌ష్యాపై చ‌ర్య‌ తీసుకుంది.

అసలేం జరిగింది?
వచ్చే ఏడాది టొక్యో వేదికగా ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో రష్యాలోని పలువురు అథ్లెట్లకు డోప్ టెస్టులు నిర్వహించారు. అయితే, ఈ డోప్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిన వారి డేటాను మాస్కోలోని ల్యాబ్‌లో భద్రపరిచారు. అలా భద్రపరిచిన డేటాను డిలీట్ చేసిన‌ట్లు ర‌ష్యా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది.

వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!వీడియో: వన్‌డౌన్‌లో శివమ్ దూబేని పంపడం వెనుక ప్రధాన కారణమిదే!

ఈ నేపథ్యంలో ఈ అంశంపై మూడు వారాల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని వ‌ర‌ల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ర‌ష్యా ఒలింపిక్ సంఘానికి లేఖ రాసింది. అందులో డ్ర‌గ్ టెస్టులో పాటిజివ్‌గా తేలిన అథ్లెట్ల డేటాను ఎలా డిలీట్ చేశార‌ని వాడా ప్ర‌శ్నించింది. రష్యా ఒలింపిక్ సంఘం నుంచి సంతృప్తికరమైన వివరణ రాకపోవడంతో వాడా ఈ నిర్ణయం తీసుకుంది.

టెస్టుల్లో 400 నాటౌట్: తన రికార్డుని బద్దలు కొట్టే ఆ ఇద్దరి భారత ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన లారాటెస్టుల్లో 400 నాటౌట్: తన రికార్డుని బద్దలు కొట్టే ఆ ఇద్దరి భారత ఆటగాళ్ల పేర్లు వెల్లడించిన లారా

ఇటీవలే రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ (ఆర్‌యూఎస్‌ఏడీఏ) చీఫ్‌ యూరీ గానస్‌ మాట్లడుతూ "నిషేధం తప్పేలా లేదు. నాలుగేళ్ల పాటు ఆటలకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో మా వాళ్లకు టోక్యో ఒలింపిక్స్‌ (2020), బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ (2022) మెగా ఈవెంట్లలో పాల్గొనే అవకాశం ఉండకపోవచ్చు" అని అన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, December 9, 2019, 16:50 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X