న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ టైటిల్ గెలిచిన ఇండియన్ ఇతడే (వీడియో)

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ)లో భార‌త సంత‌తి రెజ్ల‌ర్ జింద‌ర్ మ‌హ‌ల్ రికార్డు సృష్టించాడు. హెవీవెయిట్ చాంపియ‌న్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. 

By Nageshwara Rao

హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ (డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ)లో భార‌త సంత‌తి రెజ్ల‌ర్ జింద‌ర్ మ‌హ‌ల్ రికార్డు సృష్టించాడు. హెవీవెయిట్ చాంపియ‌న్‌షిప్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం చికాగోలో జరిగిన బ్యాక్‌లాష్ ఈవెంట్లో స్టార్ రెజ్ల‌ర్ రాండీ ఒర్టాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.

దీంతో 2007లో ద గ్రేట్ ఖ‌లీ త‌ర్వాత ఈ చాంపియ‌న్‌షిప్ గెలిచిన రెండో భారతీయుడిగా జింద‌ర్ నిలిచాడు. డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈకి జింద‌ర్ 50వ చాంపియ‌న్‌ కావడం విశేషం. మహల్ కెరియర్‌లో తన తొలిసారి చాంపియన్‌‌ని గెలిచాడు. ఈ విజయంతో ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

‘Vince McMahon was very happy’ after Jinder Mahal won the WWE title at Backlash

కెనడా పౌరసత్వం కలిగిన జిందర్ మహల్.. డబ్ల్యూడబ్ల్యూఇ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న రెండవ భారతీయ రెజ్లర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఈ విజయం తర్వాత రెజ్లింగ్ అభిమానులు ఇండియా నంబ‌ర్ వ‌న్ అంటూ పెద్దగా అరిచారు. ఇక జిందర్ మాట్లాడుతూ ఈ విజయంతో మ‌హ‌రాజ్ యుగం మొద‌లైంద‌ని చెప్పాడు.

టోర్నీకి ముందు మహల్ భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నందుకు గర్వంగా ఉందని, ఈ టోర్నీలో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X