న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొచ్చుకున్న విజయ్ మాల్యా: లండన్‌లో ఏం చేశాడో తెలుసా?

By Nageshwara Rao

హైదరాబాద్: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్‌తో తలదాచుకుంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా తన కంపెనీల పేర్లను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా తన ఫార్ములా వన్‌ టీమ్‌ 'ఫోర్సు ఇండియా' నుంచి ఇండియాను తొలగించనున్నట్లు తెలిపాడు.

ఇకపై దీనిని ఫోర్స్‌ వన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ఫోర్స్ వన్ పేరుతో టీమ్‌ను రీబ్రాండింగ్ చేయనున్నట్లు కంపెనీ సీవోవో ఒట్మార్ జాఫ్నెర్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా స్పాన్సర్లను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు.

తొలి దశలో భాగంగా పేరు మార్పునకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను ఇప్పటికే మోటార్‌స్పోర్ట్స్.కామ్‌కు అందజేశారు. లండన్‌లోని మాల్యా ఇంటి అడ్రస్‌పై ఫోర్స్‌ వన్‌తో పేరుతో ఆరు కంపెనీలు రిజిస్టర్ చేశారు. ఫోర్స్‌ వన్‌ గ్రాండ్‌ ప్రీ, ఫోర్స్‌ వన్‌ రేసింగ్‌, ఫోర్స్‌ వన్‌ టీమ్‌, ఫోర్స్‌ వన్‌ టెక్నాలజీ, ఫోర్స్‌ వన్‌ హాస్పిటాలిటీ, ఫోర్స్‌ వన్‌ బ్రాండ్‌ కంపెనీలను మాల్యా ఏర్పాటు చేయనున్నాడు.

Vijay Mallya may remove 'India' from F1 team Force India's name

ఫోర్స్ ఇండియా డైరెక్టర్‌గా పని చేసిన తిరువన్నమలై లక్ష్మికాంతన్‌నే ఇక్కడ కూడా డైరెక్టర్‌గా పేర్కొన్నారు. గతంలో చాలా భారత కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరించినా ఇప్పుడు చాలా కంపెనీలు ముఖం చాటేశారని జాఫ్నెర్ వెల్లడించారు. ప్రస్తుతం ఒకటి, రెండు కంపెనీలు మాత్రమే ఉన్నాయని అన్నారు.

మరోవైపు ఫోర్స్‌ ఇండియా అంటే ఏదో భారత్‌కు చెందిన కంపెనీగా స్పాన్సర్లు భావిస్తున్నారని అందుకే బ్రాండ్‌ వాల్యూ పెంచడం కోసం పేరు మార్చాలనుకున్నట్టు విజయ్ మాల్యా తెలిపాడు. పేరు మార్పుతో ప్రపంచంలోని అత్యున్నత కంపెనీలు స్పాన్సర్లుగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫోర్స్ ఇండియాలో మాల్యా, సహారా గ్రూప్‌నకు చెరో 42.5 శాతం వాటా ఉండగా, డచ్ వ్యాపారవేత్త మిచెల్ మోల్‌కు 15 శాతం వాటా ఉంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X