న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రత్యేకతలివే: ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగు కోసం పూమా బూట్లు

By Nageshwara Rao

హైదరాబాద్: శుక్రవారం లండన్‌లో జరుగనున్న ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటున్న జమైకా చిరతు ఉసేన్ బోల్ట్‌కు ఇదే చివరి పరుగు కానుంది. 2015లో ఓ సమావేశంలో మాట్లాడుతూ 2017లో జరగనున్న ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొని పరుగు నుంచి నిష్క్రమిస్తానని బోల్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఉసేన్ బోల్ట్ చివరి పరుగు కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది. ఎనిమిదిసార్లు ఒలింపిక్స్‌ విజేతగా, ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో పదకొండు సార్లు స్వర్ణపతకాలు అందుకున్న బోల్ట్‌ చివరిసారిగా ప్రపంచ అథ్లెటిక్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో పోటీ పడనున్నాడు.

ఇప్పటికే రిటైర్మెంట్‌ ప్రకటించిన ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకి ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ 'ప్యుమా' బోల్ట్‌ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ సరికొత్త బూట్లను తయారు చేసింది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బోల్ట్‌ తల్లిదండ్రులు వెలెస్లీ, జెన్నిఫర్‌ బోల్ట్‌ అతనికి అందజేశారు.

విభిన్న రంగుల్లో బూట్లు

విభిన్న రంగుల్లో బూట్లు

ఈ రెండు బూట్లు కూడా విభిన్న రంగుల్లో ఉండటం విశేషం. ఒక బూటు పర్పుల్‌ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్‌ చిన్నప్పుడు ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్‌ హైస్కూల్‌'కు సంబంధించిన కలర్‌. దీనిపై ఫరెవర్‌ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్‌ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది.

ముగింపుకు నిదర్శనం

ముగింపుకు నిదర్శనం

ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా' సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్‌ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్‌ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా రూపొందించారు. శనివారం రాత్రి జరిగే రేసులో ఈ బూట్లతోనే బోల్ట్‌ తన ఆఖరి రేసులో పరుగెత్తనున్నాడు.

అగస్టు 12 400 మీటర్ల రీలే పరుగు

అగస్టు 12 400 మీటర్ల రీలే పరుగు

ఆ తర్వాత అగస్టు 12 జరగబోయే 400 మీటర్ల రీలే పరుగు పందెంలో పాల్గొని రిటైర్‌ అవుతాడు. ఈ రెండు పోటీల్లో పాల్గొనేందుకు చాల ఉత్సాహంగా ఎదురు చూస్తున్ననని తెలిపాడు. బోల్ట్‌ రిటైర్మెంట్‌పై అమెరికాకు చెందిన స్ప్రింటర్‌ ప్రపంచ ఛాంపియన్‌ జస్టిన్‌ గాట్లిన్‌ స్పందించాడు బోల్ట్‌ తన నిర్ణయంపై పునరలోచించుకోవాలన్నాడు. బోల్ట్‌లో ఇంకా పరిగెత్తే సత్తా ఉందన్నాడు.

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ పాల్గొనే పరుగు వివరాలివే:

వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్ పాల్గొనే పరుగు వివరాలివే:

శుక్రవారం, 4 ఆగస్టు: 20:45 BST - 100 మీటర్లు తొలి రౌండ్

శనివారం, 5 ఆగస్టు: 19:05 BST & 21:45 BST - 100మీటర్లు సెమీ ఫైనల్ & పైనల్

శనివారం, 12 ఆగస్టు: 10:55 BST - 4x100m రిలే క్వాలిఫయింగ్ (if nominated)

శనివారం, 12 ఆగస్టు: 21:50 BST - 4x100 మీటర్లు రిలే ఫైనల్

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X