న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియోలో సంచలనం: సింగపూర్ కుర్రాడి చేతిలో ఫెల్ప్స్‌‌కు షాక్

By Nageshwara Rao

రియో డీ జనీరో: స్విమ్మింగ్ రారాజుగా పేరుగాంచిన అమెరికా దిగ్గజ స్విమ్మర్ మైకెల్ ఫెల్ప్స్‌కు ఓ చిన్న చేప షాకిచ్చింది. స్విమ్మింగ్ అంటేనే మైకెల్ ఫెల్ప్స్ అనేలా పేరు సంపాదించి రికార్డు స్థాయిలో 26 పతకాలు (22 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్య పతకాలు) సాధించి 2,168 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టాడు.

Unique celebration at Singapore's Changi Airport as Joseph Schooling beats Phelps

ఈ స్విమ్మింగ్ దిగ్గజం ఫెల్ప్స్ 100 మీటర్ల బటర్ ఫ్లై ఫైనల్స్‌లో మాత్రం ఓడిపోయాడు. సింగపూర్ దేశానికి చెందిన 21 ఏళ్ల జోసెఫ్ స్కూలింగ్ 50.39 సెకన్లలో గమ్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ అందుకోగా 31 ఏళ్ల ఫెల్ప్స్ సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ఒకసారి ఈ కింద ఫొటో చూడండి.

సింగపూర్ చరిత్రలోనే జోసెఫ్ స్కూలింగ్ మొట్టమొదటి గోల్డ్ మెడల్‌ను సాధించిన ఒలింపియన్‌గా రికార్డు సృష్టించాడు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ ముందు ఫెల్ప్స్‌ను 13 ఏళ్ల జోసెఫ్ కలుసుకున్నాడు. అప్పటి నుంచి ఫెల్ప్స్ ను ఎంతగానో ఇష్టపడి స్విమ్మింగ్‌పై మక్కువ పెంచుకున్నాడు.

కఠోర సాధన చేసి 2011లో ఫెల్ప్స్ వయసు(26 ఏళ్లు) ఉన్న వాళ్లను 100 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్లో కేవలం 15-16 ఏళ్ల వయసులోనే ఓడించాడు. లండన్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న జోసెఫ్ చిన్న తప్పిందం కారణంగా రేసులో వెనుకపడిపోయాడు. ఆ ఈవెంట్ తర్వాత తనకు ఆదర్శప్రాయుడైన ఫెల్ప్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో స్విమ్మింగ్‌లో రాటుదేలాడు.

లండన్ ఒలింపిక్స్‌లో ఈవెంట్ ముగిసిన తర్వాత బాధపడుతున్న జోసెఫ్ వద్దకు వచ్చి ఫెల్ప్స్ ఓదార్చి, ఏం జరిగిందని అడిగాడు. తన గాగుల్స్(కళ్లద్దాలు) అంతర్జాతీయ స్థాయిలో లేవని చాలా ఆలస్యంగా తెలుసుకుని వాటిని మార్చుకున్నాను, అయితే అప్పటికే అంతా అయిపోయిందని వాపోయాడు. చిన్న వయసే కాబట్టి నీకింకా చాలా భవిష్యత్తు ఉందని ఫెల్ప్స్ అతడిలో ఉత్సాహాన్ని నింపాడు.

ఆ తర్వాత రియోలో శుక్రవారం జరిగిన పురుషుల 100 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో పాల్గొన్న స్కూలింగ్ 50.39 సెకన్లలో ఈవెంట్ పూర్తి చేసి బంగారు పతకాన్ని ఒడిసిపట్టగా, 22 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన ఫెల్ఫ్స్ వరుస విజయాలకు తెరదించి అతన్ని రజతానికి పరిమితం చేశాడు.

చిత్రంగా అమెరికన్ స్విమ్మర్ ఫెల్ఫ్స్, దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లీ క్లోస్, హంగేరీ స్విమ్మర్ లాజ్లో సేహ్ లు సరిగ్గా 51.14 సెకన్లలో ఈవెంట్ ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈవెంట్ తర్వాత ఫెల్ప్స్ మాట్లాడుతూ పతకాలు వేటలో అలిసిపోయానని, శరీరం సహకరించడంలేదని, అయినప్పటికీ అనుకున్న విధంగా పతకాలు రావడం సంతోషంగా ఉందని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X