న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్ తరపు నుంచి డబ్ల్యూడబ్ల్యూకి మరో రెజ్లర్ 'సౌరవ్ గుజ్రార్'

హైదరాబాద్: భారత్ తరపున WWE లో ఆడేందుకు మరో క్రీడాకారుడు ఎంపికయ్యాడు. జాన్ సేనా, రాక్, అండర్ టేకర్ వీళ్లే నా హీరోలు అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సౌరవ్. ఈ ఆనందంలో తన గతాన్ని, విజయాలను ఇలా పంచుకున్నాడు.

మళ్లీ యాక్టింగ్‌కు వెళ్లాలనుకుంటే

మళ్లీ యాక్టింగ్‌కు వెళ్లాలనుకుంటే

అవకాశాలు వచ్చాయి కాబట్టి యాక్టింగ్ ఎంచుకున్నాను కానీ, నాకు చిన్ననాటి నుంచి రెజ్లర్ కావాలని ఆసక్తిగా ఉండేది అంటున్నాడు ఈ రెజ్లర్. ఇప్పటికీ తాను చాలా మందికి మహాభారతంలోని భీముడిగానే పరిచయస్థుడు. నెలల తరబడి టీవీలో ప్రసారమవుతున్న మహాభారతం సీరియల్‌లో భీముడి పాత్ర పోషిస్తున్న సౌరవ్ తనకు యాక్టింగ్‌కు తిరిగి వెళ్లడం పెద్ద కష్టమైన పని కాదని చెప్తున్నాడు.

 రెజ్లర్ కావడమే నా జీవిత లక్ష్యం

రెజ్లర్ కావడమే నా జీవిత లక్ష్యం

మధ్యప్రదేశ్‌లోని ఛంబల్ లోయా ప్రాంతానికి చెందిన సౌరవ్ గుజ్రార్ కేన్, అండర్‌టేకర్, రాక్ లను చూస్తూనే పెరిగాడట. తనకు చిన్నతనం నుంచి రెజ్లర్ కావాలని ఆసక్తిగా ఉండేదట. యాక్టింగ్ వెళ్లకముందు స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ సైతం గెలుచుకున్నాడు. కాగా ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో పోటీ చేసేందుకు అర్హత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

 బాక్సింగ్‌ను పదేళ్ల క్రితం నేర్చుకున్నా

బాక్సింగ్‌ను పదేళ్ల క్రితం నేర్చుకున్నా

'నా జీవితానికి హర్యానా ప్రాంతం పునాది రాయి వంటిది. పదేళ్ల క్రితం.. స్కూలింగ్ అయిపోయిన వెంటనే నేను రోహ్‌తక్‌లోని మహర్షి దయానంద విశ్వ విద్యాలయంలో చేరాను. అక్కడే బాక్సర్‌గా శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాను. 2006 సంవత్సరానికి హెవీ వెయిట్ విభాగంలో స్టేట్ ఛాంపియన్‌గా నిలిచాను. చాలా మంది క్రీడాకారులను, అథ్లెట్లను తయారుచేసిన హర్యానా నాకు మంచి ప్రోత్సాహాన్ని అందించింది. నాకిన్ని విధాల సహాయపడిన హర్యానాను తగ్గ స్థాయిలో ప్రఖ్యాతి తీసుకొస్తాను.' అని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.

పక్కింట్లో టీవీ చూస్తూనే

పక్కింట్లో టీవీ చూస్తూనే

'మా నాన్న సాధారణ రైతు. మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. పక్కింట్లో చూస్తూ రెజ్లింగ్ ఆటనే ప్రేరణగా తీసుకుని పెరిగా. రాక్, కేన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడూ వాళ్ల కలుస్తానా అనే ఆత్రంగా ఉన్నా. అంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. అతని కల, గమ్యం చాలా సాధారణమైనవని తెలిపాడు. కేవలం హెవీ వెయిట్ విభాగంలో ఛాంపియన్‌గా నిలవడమే అని పేర్కొన్నాడు.

 రెజ్లింగ్ కోసం యాక్టింగ్ వదిలేసి

రెజ్లింగ్ కోసం యాక్టింగ్ వదిలేసి

ఇప్పటివరకు భారత్ నుంచి WWEకు జిందర్ మహల్, కవితా దేవీ, ఖలీ ఇంకొందరు ప్రముఖులు ఎంపికయ్యారు. కాగా, రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న బ్రహ్మస్త్ర సినిమా షూటింగ్‌లో సౌరవ్ గుజ్రార్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 11:20 [IST]
Other articles published on Feb 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X