న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Paralympics 2020లో లవ్‌ ప్రపోజల్‌.. ట్రాక్‌పైనే అంధ అథ్లెట్‌కు ప్ర‌పోజ్ చేసిన గైడ్‌ (వీడియో)!!

Track guide proposed sprinter Keula Nidreia Pereira in Tokyo Paralympics 2020

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో పారాలింపిక్స్‌ 2020లో ఓ అంధ అథ్లెట్‌కు మెడ‌ల్ ద‌క్క‌లేదు కానీ ఎంగేజ్మెంట్ రింగ్ మాత్రం చిక్కింది. కేప్ వ‌ర్డే దేశానికి చెందిన స్ప్రింట‌ర్ కౌలా నిద్రేయి పెరీరా సిమెడో.. సెమీ ఫైన‌ల్లోనే ఇంటిదారిపట్టినా ఆమెకు జీవిత భాగ‌స్వామి దొరికేశాడు. దాంతో ఆమె సంతోషంలో మునిగిపోయింది. ఒలింపిక్‌ గడ్డ అందరికీ గెలుపోటముల అనుభవాలను ఇస్తే.. ఆమెకు మాత్రం జీవిత భాగస్వామినిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

IPL 2021: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్.. రిషబ్ పంత్‌కే ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు కెప్టెన్సీ!!IPL 2021: శ్రేయస్‌ అయ్యర్‌కు షాక్.. రిషబ్ పంత్‌కే ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు కెప్టెన్సీ!!

అంధ అథ్లెట్ అయిన పెరీరా సిమెడో.. పారాలింపిక్స్‌ 2020లోని 200 మీట‌ర్స్ ఈవెంట్ హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఎంతో కష్టపడినా ఓడిపోవడంతో ఆ సమయంలో పెరీరా చాలా నిరుత్సాహ పడింది. అప్పుడే తన వద్దకు వచ్చాడు గైడ్‌ అయిన మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగా. ర‌న్నింగ్ ట్రాక్‌పైనే ఒక్కసారిగా మోకాళ్ల మీద కూర్చుని లవ్ ప్ర‌పోజ్ చేశాడు. 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడిగాడు. అందుకు ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన పెరీరా.. తేరుకుని అవును అని అనడంతో అక్కడ ఆటగాళ్లందరూ చప్పట్లు కొట్టారు. ట్రాక్‌పై జ‌రిగిన ఆ ఎంగేజ్మెంట్ ఎపిసోడ్‌ను లైవ్ కెమెరాలు షూట్ చేశాయి.

అథ్లెట్ కౌలా నిద్రేయి పెరీరా సిమెడో, గైడ్‌ మాన్యువల్ ఆంటోనియో వాజ్ డా వేగాల ఈ సర్‌ప్రైజ్‌ లవ్‌ ట్రాక్‌ను టోక్యో 2020 పారాఅథ్లెటిక్స్‌ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది. 'జీవితంలో ఇద్దరూ కలిసి పరుగులు ప్రారంభించండి' అంటూ ట్వీట్‌ చేసింది. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయి నెటిజన్ల మనసు దోచుకుంది. ఆ జంట‌కు అనేక మంది కంగ్రాట్స్ కూడా తెలిపారు. 15 ఏళ్ల నుంచే అథ్లెట్‌గా మారిన పెరీరా సిమెడోను 2012లో ఆఫ్రికాలోని కేప్‌ వర్డే ప్రభుత్వం స్పోర్ట్స్‌ మెరిట్ మెడల్‌తో సత్కరించింది. పారాలింపిక్స్‌లో అంధ అథ్లెట్లు ప‌రుగు తీస్తుంటే.. వారికి తోడుగా గైడ్‌లు ఉంటారు. ఆ ఇద్ద‌రి చేతుల్ని క‌ట్టేసి ప‌రుగెత్తిస్తారు.

Tokyo Paralympics 2021 : India’s Medals పతకాల పంట Mariyappan, Sharad Kumar || Oneindia Telugu

మరోవైపు పారాలింపిక్స్‌ 2020లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతున్నది. శుక్రవారం హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రజతం కైవసం చేసుకుంటే.. ఇప్పటికే షూటింగ్‌లో స్వర్ణంతో మెరిసిన అవని లేఖరా మరో కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ కాంస్యం కైవసం చేసుకోవడంతో శుక్రవారం భారత్‌ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. ఆదివారంతో ముగియనున్న ఈ క్రీడల్లో ఇప్పటి వరకు భారత్‌ మొత్తం 13 (2 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు) పతకాలు సాధించింది. టోక్యో విశ్వక్రీడలకు ముందు వరకు జరిగిన పారాలింపిక్స్‌ క్రీడలన్నింటిలో కలిపి భారత్‌ 12 పతకాలే నెగ్గగా.. తాజా క్రీడల్లోనే ఆ సంఖ్యను దాటడం గమనార్హం.

శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్‌ (టీ64)లో 2.07 మీటర్ల ఎత్తు దూకిన 18 ఏళ్ల ప్రవీణ్‌ కుమార్‌ రజతం సాధించడంతో పాటు ఆసియా రికార్డును బద్దలు కొడుతూ.. భారత్‌ తరఫున విశ్వక్రీడల్లో పతకం నెగ్గిన అతి పిన్నవయస్కుడిగా రికార్డుల్లోకెక్కాడు. మహిళల 50 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ త్రి పొజిషన్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో 19 ఏండ్ల అవని 445.9 పాయింట్లతో కాంస్యం నెగ్గడం ద్వారా.. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా చరిత్రకెక్కింది. వ్యక్తిగత రికర్వ్‌ ఆర్చరీలో హర్విందర్‌ సింగ్‌ కాంస్య పతకం సాదించాడు. పారాలింపిక్స్‌ ఆర్చరీ చరిత్రలో భారత్‌కు ఇదే తొలి పతకం.

Story first published: Saturday, September 4, 2021, 8:01 [IST]
Other articles published on Sep 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X