న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2020:ఇటు ఒలింపిక్స్ - అటు చంటిపిల్లలు - మధ్యలో నలుగుతున్న తల్లులు: ఎందుకీ కఠినత్వం

Tokyo olympics:Young Mothers express unhappiness over organisers strict measures

టోక్యో ఒలింపిక్స్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని క్రీడలు ప్రారంభమయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్వాహకులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. అదే సమయంలో జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే నిర్వాహకులు తీసుకొచ్చిన కఠిన నిబంధనలపై కొందరు క్రీడాకారులు అసహనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు ఎందుకు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు...?

 కుటుంబ బంధాలు

కుటుంబ బంధాలు

టోక్యో ఒలంపిక్స్‌పై కరోనా పడగ విప్పింది. ఇప్పటికే 60 మందికి పైగా కరోనా బారినపడి ఐసొలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే కఠిన నిబంధనలను నిర్వాహకులు అమలు చేస్తున్నారు. దీనిపై కొందరు క్రీడాకారులు చాలా అసంతృప్తి, ఆసహనం , ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది ఒక క్రీడాకారుడి కల. అయితే ఈ కలను నిజం చేసుకునేందుకు ఎన్ని అడ్డంకులు ఒడిదుడుకులు ఎదురైనా... వాటిని విజయవంతంగా ఎదుర్కొని ఒలింపిక్ బరిలో అడుగుపెడతారు. అయితే కొన్ని కష్టాలు మాత్రం వారిని నిరుత్సాహపరుస్తున్నాయి. అదే కుటుంబ బంధాలు.

 కఠిన నిబంధనలతో..

కఠిన నిబంధనలతో..

అవును.. ఒలింపిక్స్‌లో కొందరు తల్లులైన మహిళా క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారి పిల్లలు కాస్త పెద్దవారైతే ఫర్వాలేదు కాని నెలల పిల్లలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ వైపు ప్రతిష్టాత్మకమైన క్రీడలు మరో వైపు చంటిపిల్లలను వీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడలతో సంబంధం ఉన్నవారికి తప్ప మరెవరూ క్రీడాకారులతో పాటు రాకూడదనే కఠిన నిబంధన తీసుకొచ్చారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఈ నిబంధనే ఇప్పుడు ఆ తల్లులకు శరాఘాతంగా మారింది. ఇక తన కష్టాన్ని ఆవేదనను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా తెలిపింది ఓనా కార్బోనెల్ అనే స్పానిష్ క్రీడాకారిణి.

 చిన్నారిని వదిలేసి...

చిన్నారిని వదిలేసి...

ఈ ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 11 నెలల వయసున్న తన కొడుకును వదిలేసి రావాల్సి వచ్చిందని ఓనా కార్బోనెల్ ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న పిల్లలు ఉన్న మహిళా క్రీడాకారులు వారిని కూడా టోక్యో ఒలింపిక్స్‌కు తీసుకురావచ్చనే నిబంధన ఉందని.. కానీ ఇక్కడ స్థానిక ఆర్గనైజర్లు మాత్రం ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారని కార్బోనెల్ ఆవేదన వ్యక్తం చేసింది.

తన కొడుకును వదలి టోక్యోకు వెళ్లడం నిజంగా బాధగా అనిపిస్తోందని చెప్పుకొచ్చిన ఆమె... నిర్వాహకులు ఇంత కఠిన నిర్ణయం లేదా నిబంధనలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చాలా నిరాశతో నిస్పృహతో టోక్యోకు బయలుదేరి వెళుతున్నట్లు కార్బోనిల్ పోస్టు చేసింది. అయితే కార్బోనిల్ పోస్టుకు చాలామంది నెటిజెన్లు మద్దతు తెలిపారు. నిర్వాహకులపై మండిపడ్డారు.

ఎందుకీ నిబంధనలు

ఎందుకీ నిబంధనలు

కరోనా అంతమయ్యేవరకు ఇలా కొన్ని బంధాలను పక్కన పెట్టాల్సిందేనంటూ కార్బోనెల్ చెప్పుకొచ్చింది. అమ్మతనం, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఈ రెండు కూడా వీటికి అతీతం కాదని వెల్లడించింది. కోవిడ్ నిబంధనల కారణంగా క్రీడాకారులతో పాటు తమ కుటుంబ సభ్యులు రావడం కుదరదు. అయితే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాత్రం చిన్నపిల్లలున్న తల్లులు వారిని జపాన్‌కు తీసుకురావచ్చని పేర్కొంది. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు.

Story first published: Thursday, July 22, 2021, 10:21 [IST]
Other articles published on Jul 22, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X