న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo 2020: ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే ప్రధాన స్టేడియం ఆరంభం (వీడియో)

Tokyo 2020: Olympic Stadium Officially Opened

హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే ఒలింపిక్స్‌కు జపాన్ రాజధాని టోక్యో నగరం ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరిగే ఒలింపిక్స్‌ కోసం టోక్యో కూడా తన ప్రధాన స్టేడియాన్ని సిద్ధం చేసేసింది.

ఆదివారం ఈ స్టేడియాన్ని ఆరంభించడంతో పాటు మీడియా కోసం అందుబాటులో ఉంచారు. టోక్యో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోన్న ప్రధాన స్టేడియం ఇదే కాడవం విశేషం. దాదాపు 68 వేల మంది కూర్చొని ఆటలను వీక్షించే వీలున్న ఈ క్రీడా వేదికను ప్రముఖ జపాన్‌ రూపశిల్పి కెంగో కుమా డిజైన్‌ చేశాడు.

<strong>'కోహ్లీ సంపాదించిన " title="'కోహ్లీ సంపాదించిన "లెజెండ్" హోదాను సాధించాలని ఉంది'" />'కోహ్లీ సంపాదించిన "లెజెండ్" హోదాను సాధించాలని ఉంది'

స్టేడియం యొక్క ముఖభాగం

ఈ స్టేడియం యొక్క ముఖభాగం జపాన్ యొక్క 47 ప్రాంతాల నుండి సేకరించిన కలపతో రూపొందించారు. దీంతో స్టేడియం ఆవరణలో 47,000 కంటే ఎక్కువగా మధ్యస్థ, చిన్న పరిమాణం కలిగిన చెట్లను నాటారు. వీటి వల్ల సహజమైన గాలి ప్రసరించి వేడి, తేమను విడుదల చేయడంలో సహాయపడతాయి.

అథ్లెట్లను చల్లగా ఉంచడానికి

అథ్లెట్లను చల్లగా ఉంచడానికి

ముఖ్యంగా ఇవి అభిమానులతో పాటు అథ్లెట్లను చల్లగా ఉంచడానికి సహాయపడతాయి. ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌ కూడా ఇక్కడే జరగనున్నాయి. దీని నిర్మాణం 2016 డిసెంబర్‌లో ఆరంభం కాగా.. మొదట బ్రిటన్‌ రూపశిల్పి జహా హజీద్‌ డిజైనింగ్‌ ఆరంభించాడు. ఆ తర్వాత కెంగో కుమా దీనిని పూర్తి చేశాడు.

రూ.10 వేల కోట్లు ఖర్చు

ఈ ప్రధాన స్టేడియం నిర్మాణానికి సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు. పచ్చదనంతో కళకళలాడుతున్న ఈ స్టేడియంలో ఒలింపిక్స్‌ కన్నా ముందు జనవరి 1 నుంచి ఎంపరర్స్‌ కప్‌ జెఎఫ్ఏ 99వ జపాన్ పుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత జులై 24 నుంచి ఒలింపిక్స్‌ పోటీలు జరగనున్నాయి.

Story first published: Tuesday, December 17, 2019, 13:14 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X