న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రష్యాపై నాలుగేళ్లు నిషేధం: డిసెంబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అసలేం జరిగింది?

Timeline of Russia’s doping cases and cover-ups


హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్‌కు ముందు వరల్డ్ డోపింగ్ యాంటీ ఏజెన్సీ(వాడా) రష్యాకు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. వచ్చే నాలుగేళ్లలో ఒలింపిక్స్‌తోపాటు ఏ మేజర్‌ అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొనకుండా రష్యాపై వాడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. లుసానెలో సోమవారం సమావేశమైన వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు రష్యా దూరమైంది. టోక్యో వేదికపై రష్యా జాతీయ పతాకం కనిపించదు. జాతీయ గీతం కూడా వినిపించదు. అంతేకాదు 2020 పారాలింపిక్స్, 2022 యూత్‌ ఒలింపిక్స్, 2022లో బీజింగ్‌ ఆతిథ్యమివ్వనున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగే అవకాశాన్ని కోల్పోయింది.

అయితే డోపింగ్‌‌కు పాల్పడని రష్యా క్రీడాకారులకు 'వాడా' వెసులుబాటు కల్పించింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది. స్వతంత్ర హోదాలో పాల్గొనే రష్యా అథ్లెట్లు పతకాలు గెలిచినా అవి రష్యా ఖాతాలోకి రావని తెలిపింది.

ఎప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి పరిశీలిద్దాం:

జర్మన్‌ టీవీలో డాక్యుమెంటరీ

జర్మన్‌ టీవీలో డాక్యుమెంటరీ

డిసెంబర్, 2014: రష్యా డోపింగ్‌పై జర్మన్‌ టీవీలో ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. ఇది అంతర్జాతీయ క్రీడాలోకాన్నే నిర్ఘాంతపరిచింది. సాధారణంగా డోపింగ్‌లో ఇప్పటివరకు ఆటగాళ్లు మాత్రమే దొరుకుతారు. అయితే, అందుకు భిన్నంగా ఈ డోపింగ్ ఆ దేశం హస్తం కూడా ఉండటంతో దీనిపై పెద్ద చర్చ జరిగింది.

నవంబర్, 2015: తీవ్ర ఆరోపణలపై నేపథ్యంలో రష్యాలో డోపింగ్‌పై వాడా 2015లో డిక్‌ పౌండ్‌ నేతృత్వంలో స్వతంత్ర విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. రష్యా ప్రభుత్వం, రష్యా డోపింగ్‌ నిరోధ సంస్థ తమ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్లు డోపింగ్‌ పాల్పడేలా ప్రోత్సహిస్తున్నాయని ఆ సంఘం తేల్చింది. దీంతో రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థపై ‘వాడా', ఆటగాళ్లపై అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్య వేటు వేసింది.

సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో 15 మంది

సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో 15 మంది

జులై 18, 2016: 2014 సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో 15 మంది పతక విజేతలు సహా అనేక మంది రష్యా అథ్లెట్లు ప్రభుత్వమే నడిపిస్తోన్న డోపింగ్‌లో భాగమని న్యూయార్క్‌ టైమ్స్‌ 2016 మేలో వెల్లడించింది. న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంతో కెనడాకు చెందిన క్రీడా లాయర్ రిచర్డ్‌ మెక్‌లారెన్‌ నేతృత్వంలో వాడా విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. 2011 నుంచి 2015 వరకు రష్యా డోపింగ్‌కు పాల్పడినట్లు ఈ కమిటి ‘వాడా'కు నివేదిక అందజేసింది. అయితే రియో ఒలింపిక్స్‌ నుంచి రష్యాను మొత్తంగా నిషేధించాలన్న వాడా సూచనను ఐఓసీ తిరస్కరించింది. నిషేధ అధికారాన్ని ఆయా సమాఖ్యలకే వదిలేసింది.

ఆగస్టు, 2016: రియో ఒలింపిక్స్‌లో రష్యా జట్టులో 276 మంది అథ్లెట్లకు అవకాశమిచ్చారు. డోపింగ్ కారణంగా 111 మంది క్రీడాకారులను తొలగించారు.

డిసెంబర్, 2017: అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం (ఐఓసీ) చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా తొలుత రష్యా ఒలింపిక్‌ కమిటీపై వేటు వేసింది. అదే క్రమంలో 43 మంది అథ్లెట్లపై జీవితకాల నిషేధం విధించింది. సోచి వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా గెలిచిన 13 పతకాలను తిరిగి తీసుకుంది.

స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో

స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో

ఫిబ్రవరి, 2018: స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో ఆటగాళ్ల నిషేధాలపై విచారణ ప్రారంభించింది. దీంతో ప్యాంగచాంగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో రష్యా క్రీడాకారులు తటస్థులుగా పోటీపడడానికి అనుమతించింది. స్పోర్ట్స్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల మేరకు ప్యాంగ్‌చాంగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో 168 మంది రష్యన్లకు ఐఓసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ క్రీడల్లో పోటీ పడ్డ 168 మందిలో ఇద్దరు డోప్‌ పరీక్షల్లో పట్టుబడ్డారు.

సెప్టెంబర్, 2018: మాస్కో ల్యాబోరేటరీ డేటా ఇచ్చేందుకు రష్యా డోపింగ్‌ నిరోధక సంస్థ అంగీకరించడంతో ఆ సంస్ధపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని 2018 సెప్టెంబరులో వాడా నిర్ణయించింది.

జనవరి, 2019: ఈ ఏడాది జనవరిలో మాస్కో ల్యాబ్‌ నుంచి 'వాడా' డేటాను తీసుకుంది. కానీ అది తప్పుడు డాటా అని, డోపింగ్‌లో దొరికిన అథ్లెట్లను కాపాడేందుకు అందులో చాలా మార్పులు చేశారని వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ సెప్టెంబరులో పేర్కొంది. దీంతో రష్యా ఒలింపిక్‌ కమిటీ(రుసాదా)ను మళ్లీ సస్పెండ్‌ చేయాలని, రష్యాపై నాలుగేళ్ల నిషేధం విధించాలని నవంబరులో వాడా ప్రతిపాదించింది.

కొత్త డేటాపై వాడా దర్యాప్తు

కొత్త డేటాపై వాడా దర్యాప్తు

సెప్టెంబర్, 2019: డేటా అందిన తర్వాత కొత్తగా మళ్లీ ‘వాడా' దర్యాప్తు ప్రారంభించింది. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ (దోహా)లో రష్యాపై నిషేధం కొనసాగించింది. దీనిపై వివరణ ఇచ్చుకునేందుకు గాను మూడు వారాల సమయమిచ్చింది. అయితే, రష్యా ఇచ్చిన వివరణకు వాడా సంతృప్తి చెందకపోడవంతో టోక్యో 2020 ఒలింపిక్స్ నుండి రష్యాను సస్పెండ్ చేస్తారని రష్యన్ ఒలింపిక్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది.

డిసెంబర్ 9, 2019: రష్యాపై నిషేధం. రష్యా జెండా మరియు జాతీయ గీతాన్ని ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లో పాల్గొనకుండా వాడా నాలుగేళ్లు నిషేధం విధించింది. పింగ్‌‌కు పాల్పడని రష్యా క్రీడాకారులకు ‘వాడా' వెసులుబాటు కల్పించింది. వారు స్వతంత్ర హోదాలో (అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ పతాకం కింద) పాల్గొనవచ్చని తెలిపింది.

Story first published: Tuesday, December 10, 2019, 13:34 [IST]
Other articles published on Dec 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X