న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరుదైన గౌరవం: TIME 100 Nextలో ద్యుతి చంద్‌

TIME 100 Next: Indian sprinter Dutee Chand among most influential people

హైదరాబాద్: భారత స్టార్‌ స్ర్పింటర్‌ ద్యుతి చంద్‌కు అరుదైన గౌరవం లభించింది. ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన 100 నెక్స్ట్‌ జాబితాలో ద్యుతి చంద్‌కు చోటు దక్కింది. వ్యాపార, వినోద, క్రీడా, రాజకీయ, సామాజిక ఉద్యమ, ఆరోగ్య, విజ్ఞాన, రంగాల్లో ఎదుగుతూ ఆయా రంగాల అభివృద్ధికి పాటుపడుతున్న 100 మందితో కూడిన జాబితాను టైమ్స్ బుధవారం విడుదల చేసింది.

ప్రపంచంలోని అత్యంత ప్రభావవశీలురైన జాబితా టైమ్స్ 100 లిస్ట్‌కు అదనంగా దీనిని ప్రకటించింది. ప్రభావితం చేసే వ్యక్తిగా టైమ్‌ మ్యాగజైన్‌ తనను గుర్తించడం చాలా సంతోషంగా ఉందని ద్యుతి చెప్పింది. ద్యుతి చంద్ ట్విట్టర్‌లో "టైమ్స్ మ్యాగజీన్ నుంచి వచ్చిన గుర్తింపు పట్ల చాలా సంతోషంగా ఉన్నా. లింగ సమానత్వంపై నమ్మకంతో ఉన్నా. క్రీడల్లో, సమాజంలో బాలికలు, మహిళల హక్కుల కోసం నా పోరాటాన్ని కొనసాగిస్తా" అని ట్వీట్ చేసింది.

ఇండోర్‌లో తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ఇండోర్‌లో తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగవంతమైన మహిళ ద్యుతినే కావడం విశేషం. గతేడాది జరిగిన జకర్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో రెండు రజత పతకాలు సాధించింది. ఆ తర్వాత ఈ ఏడాది ప్రపంచ యూనివర్సిటీ క్రీడల్లో స్వర్ణం చేజిక్కుంచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా స్ప్రింటర్‌గా చరిత్ర సృష్టించింది.

Story first published: Thursday, November 14, 2019, 9:55 [IST]
Other articles published on Nov 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X