న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tiger Woods‌ కారు బోల్తా.. కాళ్లకు తీవ్ర గాయాలు!!

Tiger Woods suffers leg injuries after major car crash in California

కాలిఫోర్నియా: గోల్ఫ్‌ సూపర్‌స్టార్‌ టైగర్‌ ఉడ్స్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం లాస్‌ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియాలో అతడు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. అనేకసార్లు పల్టీలు కొట్టిన అనంతరం రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు ఒక పక్క భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. టైగర్ వుడ్స్ అందులోనే ఇరుక్కుపోయాడు. కారు బోల్తా పడడంతో వెంటనే బెలూన్స్‌ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న లాస్‌ఏంజిల్స్‌ అగ్నిమాపక, పారామెడికల్‌ సిబ్బంది టైగర్ వుడ్స్‌ను కారు నుంచి వెలుపలికి తీసి స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు వెళుతున్న సమయంలో ఆయన నొప్పితో బాదపడ్డారట. ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వుడ్స్‌ రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం తెలుస్తోంది.

కాలిఫోర్నియాలోని బ్లాక్ హార్స్ రోడ్డు మార్గంలో జరిగిన ఈ ఘటన సమయంలో కారులో టైగర్ వుడ్స్ ఒక్కడే అందులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 7.12 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు వారు తెలిపారు. ప్రమాద సమయంలో వుడ్స్.. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకోలేదని, శస్త్రచికిత్స సక్సెస్ అయిందని లాస్ ఏంజిల్స్ కౌంటీ షెరీఫ్ అలెక్స్ విల్లానుయేవా చెప్పారు. భారీ ప్రమాదంలో వుడ్స్‌ గాయాలతో భయపడడం సంతోషించాల్సిన విషయమన్నారు.

45 ఏళ్ల టైగర్‌ వుడ్స్‌ ఇప్పటివరకు పీజీఏలో 82 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు. 15 మేజర్‌ ఛాంపియన్‌షిఫ్‌లను కైవసం చేసుకున్నాడు. ఇందులో ఐదు మాస్టర్‌ టోర్నమెంట్‌లు సైతం ఉన్నాయి. 2009లో ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో కూడా వుడ్స్‌ గాయపడ్డాడు.

PinkBall Test: ఎంఎస్ ధోనీ రికార్డులా.. నేను అలాంటివి పట్టించుకోను: కోహ్లీPinkBall Test: ఎంఎస్ ధోనీ రికార్డులా.. నేను అలాంటివి పట్టించుకోను: కోహ్లీ

Story first published: Wednesday, February 24, 2021, 12:11 [IST]
Other articles published on Feb 24, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X