న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలు విరిగినా.. మోకాళ్లపై పోటీ పూర్తి చేసిన అథ్లెట్(వీడియో)

 Teenagers courageous marathon effort on bloodied knees and a broken leg

హైదరాబాద్: ఆటలంటే సరదాకి మాత్రమే కాదు. ప్రాణం పెట్టి ఆడేస్తుంటారు కొందరు. గాయాలైనా లెక్క చేయకుండా గాయం రెట్టింపు అవకుండా జాగ్రత్త తీసుకుని ఆడితే పరవాలేదు. కానీ, కాలికి గాయమైనా పరుగెత్తడానికి సహకరించకపోయినా పందెం పూర్తి చేసింది జపాన్ టీనేజర్ రీ ఇడా. లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రాణం పెట్టేసింది. ఓ వైపు రక్తం కారుతున్నా.. లెక్క చేయకుండా చేతులతో గెంటుకుంటూ మోకాళ్లపై పాకుతూ పందాన్ని పూర్తి చేసింది.

కుడి కాలికి గాయంకావడంతో కుప్పకూలిపోయి

అక్టోబర్ 26న జపాన్‌లోని ఎకిడెన్ రిలే మారథాన్‌లో భాగంగా 42 కిలోమీటర్ల పరుగు పందెంలో జరిగిన ఘటన ఇది. వంతుల వారీగా పరిగెత్తే దానిలో భాగంగా 3.5కిలో మీటర్ల దూరం లక్ష్యంగా పరుగు మొదలుపెట్టిన రీ ఇడా ఇంకా 700 మీటర్ల దూరం ఉండగానే కుడి కాలికి గాయంకావడంతో కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన మేనేజర్ ఆమెను సమీపించి దాదాపు పోటీ నుంచి జట్టును తప్పిద్దామనుకున్నాడట.

ఇంకా లక్ష్యానికి ఎంత దూరం ఉందని

ఆ సమయంలో రీ ఇడా ఇంకా లక్ష్యానికి ఎంత దూరం ఉందని అడగడంతో అతను ఆ ఆలోచన నుంచి వెనక్కి తగ్గాడట. ఇలా 700 అడుగుల దూరం వరకూ చేతులతో నెట్టుకుంటూ మోకాలిపై నడుస్తూ.. తన వంతు దూరాన్ని పూర్తి చేసింది రీ ఇడా. రోడ్డు పక్కగా ఉండే తెల్లని చారలపై మోకాళ్లపై కదులుతుంటే చేతుల నుంచి కాళ్ల నుంచి రక్తం చిందిస్తున్నా పట్టుదల వీడలేదు.

పరిస్థితిని చూసిన వారంతా భావోద్వేగానికి

ఆమె పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోయినా ఆ పరిస్థితిని చూసిన వారంతా భావోద్వేగానికి గురైయ్యారు. రిలే పరుగు పందెం కావడంతో ఆమె ఇచ్చిన జెండాను అందుకుని పరుగును పూర్తి చేయాలని చూసిన మరో క్రీడాకారిణి సైతం కన్నీరు కారుస్తూ ఎదురుచూసింది. ఆమె రాగానే ఆ జెండాను అందుకుని పరుగు మొదలెట్టింది.

పట్టుదలకి పోటీలో కొనసాగాల్సి వచ్చింది

ఈ క్రమంలో స్థానిక మీడియాతో పాటుగా జాతీయ మీడియా సైతం ఆమె పట్టుదలను ప్రశంసిస్తూనే ఉన్నారు. తాను బాధ్యతపరురాలంటూ.. తనని పొగడకుండా ఉండలేమంటూ పేర్కొంటున్నారు. జట్టు హెడ్ కోచ్ మాట్లాడుతూ..' గాయం తగిలిన వెంటనే జట్టు నుంచి తప్పిద్దామనుకున్నా. కానీ, ఆమె పడిపోయినా లక్ష్యానికి ఇంకెంత దూరం ఉందని అడగడంతో తన పట్టుదలకి పోటీలో కొనసాగాల్సి వచ్చింది' అని తెలిపాడు.

Story first published: Monday, November 12, 2018, 15:39 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X