న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాథోడ్‌ అభ్యర్థన: భారత రెజ్లింగ్‌ స్పాన్సర్‌గా టాటా మోటార్స్‌

By Nageshwara Rao
Tata Motors to sponsor Indian wrestlers

ముంబై: క్రికెట్‌తో పాటు దేశంలోని మిగతా క్రీడలకు కార్పేరేట్ సంస్థలు అండగా నిలవాలంటూ ఇటీవల కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ చేసిన అభ్యర్థనకు సానుకూల స్పందన లభిస్తోంది. రాథోడ్ అభ్యర్ధన మేరకు తాజాగా భారత రెజ్లర్లకు మద్దతిచ్చేందుకు ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ముందుకొచ్చింది.

భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు మూడేళ్ల పాటు టాటా మోటార్స్ సంస్ధ ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో భారత రెజ్లింగ్ టీమ్ వేసుకునే జెర్సీలపై ఇకపై టాటా యోధ బ్రాండ్ కనిపించనుంది. ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్లు పెద్ద ఎత్తున పతకాలు సాధిస్తుండటంతో రెజ్లింగ్ ఓ ప్రధాన క్రీడగా మారింది.

కేంద్ర మంత్రి ఆభ్యర్ధన మేరకు

గత ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ భారత రెజ్లింగ్ జట్టు మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకుంది. దీంతో కొంత మంది రెజ్లర్లకు పలు సంస్థలు స్పాన్సరిప్ కూడా ఇస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే భారత రెజ్లర్లకు కార్పోరేట్ సంస్థలు అండగా నిలవాలని కేంద్ర మంత్రి కోరడంతో టాటా మోటార్స్ ముందుకొచ్చింది.

టాటా మోటార్స్‌ అధికారిక స్పాన్సర్‌షిప్‌

టాటా మోటార్స్‌ అధికారిక స్పాన్సర్‌షిప్‌

ఈ మేరకు బుధవారం ఇక్కడ స్టార్లు సుశీల్‌ కుమార్‌, యోగేశ్వర్‌ దత్‌, సాక్షి మాలిక్‌లాంటి రెజ్లర్లతో పాటు రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌ సమక్షంలో జరిగిన మీడియా సమావేశంలో టాటా మోటార్స్‌ అధికారికంగా స్పాన్సర్‌షిప్‌ అంశాన్ని ప్రకటించింది. ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆగస్టు 18 నుంచి ప్రారంభం కానున్న ఆసియా గేమ్స్‌లో పాల్గొనే రెజ్లర్లకు టాటా మోటార్స్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహారించనుంది.

సంతోషం వ్యక్తం చేసిన సాక్షి మాలిక్

సంతోషం వ్యక్తం చేసిన సాక్షి మాలిక్

టాటా మోటార్స్ స్పాన్షరిష్‌పై రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ చాలా సంతోషం వ్యక్తం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి ఇటీవల ముగిసిన రియో ఒలింపిక్స్ వరకు భారత రెజ్లర్లు తమ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు పతకాలు తెస్తున్నారని పేర్కొంది. స్పాన్షర్లు తక్కువగా ఉన్నప్పటికీ తామంతా అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నామని సాక్షి మాలిక్ తెలిపింది.

ఎంతో స్పూర్తినిస్తుంది

ఎంతో స్పూర్తినిస్తుంది

టాటా మోటార్స్‌తో తాజా ఒప్పందం మాకు ఎంతో స్పూర్తినిస్తుందని పేర్కొంది. బ్రిటిష్ లగ్జరీ బ్రాండ్స్ అయిన జాగ్వర్, లాండ్ రోవర్‌ లాంటి కార్లకు టాటా మోటార్స్ ఓనర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

Story first published: Thursday, August 2, 2018, 13:39 [IST]
Other articles published on Aug 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X