న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Belinda Bencic: స్టార్ మెడలో గోల్డ్ మెడల్: రోజర్, హింగిస్ సాధించలేనిది.. ఆమె చేతికి

Switzerlands Belinda Bencic won Olympic tennis gold against Czechs Marketa Vondrousova

టోక్యో: జపాన్ వేదికగా ప్రతిష్ఠాత్మకంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో ఓ ఇంటరెస్టింగ్ కేటగిరీలో పతక ప్రస్థానం ముగిసింది. మహిళల టెన్నిస్ సింగిల్స్ కేటగిరీలో స్విట్జర్లాండ్ స్టార్ బెలిండా బెన్‌కిక్.. స్వర్ణ పతకాన్ని ముద్దాడారు. రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో చివరి వరకూ ఫుల్ ఎనర్జీతో ఆడారామె. నిఖార్సయిన టెన్నిస్ షాట్లను ప్లే చేశారు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన తన ప్రత్యర్థి సహనానికి పరీక్ష పెట్టారు.. చివరికి మట్టికరిపించారు.

టెన్నిస్‌లో తన దేశానికి స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టిన తొలి మహిళా ప్లేయర్‌గా నిలిచారు. తన దేశానికి చెందిన రోజర్ ఫెదరర్‌, మార్టినా హింగిస్‌కు ఈ మెడల్‌ను అంకితం చేస్తోన్నట్లు చెప్పారు. రోజర్ ఫెదరర్.. స్విట్జర్లాండ్‌కు చెందిన టెన్నిస్ లెజెండ్. 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను అలవోకగా నెగ్గిన ఈ టెన్నిస్ స్టార్.. ఇప్పటిదాకా కూడా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని అందుకోలేదు. అలాగే- అదే దేశానికి చెందిన మార్టినా హింగిస్ కూడా అంతే.

తన కేరీర్ మొత్తంలో ఒక్కసారైనా ఆమె స్విట్జర్లాండ్‌కు ఒలింపిక్స్ బంగారు పతకాన్ని అందించలేకపోయారు. అలాంటిది.. 12వ సీడ్ బెలిండా బెన్‌కిక్ ఈ ఘనతను సాధించారు. ఫైనల్ మ్యాచ్ ఆడటానికి కొన్ని గంటల ముందు బెస్ట్ విషెస్ చెప్పి.. స్ఫూర్తినిచ్చిన రోజర్ ఫెదరర్‌‌, తాను అభిమానించే హింగిస్‌కు ఈ మెడల్‌ను అంకితం ఇస్తోన్నట్లు చెప్పుకొచ్చారు. ఫైనల్ మ్యాచ్‌లో బెలిండా బెన్‌కిక్, చెక్ రిపబ్లిక్‌ ప్లేయర్ మార్కెటా వుండ్రోవ్‌సొవాతో తలపడ్డారు. హోరాహోరీగా పోరు సాగింది వారి మధ్య.

రెండున్నర గంటలకు పైగా మ్యాచ్ సాగింది. తొలి, చివరి సెట్‌లో కొన్ని అద్భుతాలు చోటు చేసుకున్నాయి. మ్యాచ్‌ను పీక్స్ స్థాయికి తీసుకెళ్లారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధిస్తూ, ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్ చేస్తూ ప్రతి రౌండ్‌ను ఉత్కంఠభరితంగా మార్చివేశారు. తొలి సెట్‌‌ను 7-5తో గెలుచుకున్నారు బెన్‌కిక్. రెండో రౌండ్‌లో మార్కెటా రెచ్చిపోయారు. కసితో ఆడారు. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో బెన్‌కిక్‌ను కోర్ట్ మొత్తం పరుగులెత్తించారు. ఆ సెట్‌ను బెన్‌కిక్ 2-6తో కోల్పోయారంటే మార్కెటా ఏ స్థాయిలో ఆడారో అర్థం చేసుకోవచ్చు.

మూడో సెట్‌లో ఆ జోరును కనపర్చలేకపోయారు మార్కెటా. అదే సమయంలో కొన్ని పొరపాట్లు చేశారు. సహనం కోల్పోయారు. దీనితో ఆమె బలహీనతలను ఆసరాగా చేసుకుని బెన్‌కిక్ మైండ్ గేమ్ ఆడారు. నెట్‌కు దగ్గరగా షాట్స్ ఆడుతూ సక్సెస్ అయ్యారు. బలమైన షాట్లను ఆడుతూ మార్కెటాను అలసి పోయేలా చేశారు. రెండో సగం తరువాత ఇక బెన్‌కిక్‌కు ఎదురు లేకుండా పోయింది. ఆ సెట్‌ను 6-3 తేడాతో సులువుగా గెలిచారు.

Story first published: Sunday, August 1, 2021, 9:32 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X