న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెరవేరనున్న స్వప్న బర్మన్ కల: త్వరలో ఆడిడాస్ నుంచి ప్రత్యేకమైన బూట్లు

Swapna Barman to get customised shoes for her six-toed feet

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా ముగిసిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన స్వప్న బర్మన్‌ త్వరలో ప్రత్యేక బూట్లను అందుకోనుంది. ఒక్కో కాలికి ఆరేసి వేళ్లతో పుట్టిన స్వప్న మామూలు బూట్లతో పరిగెత్తడానికి ఇబ్బంది పడేది. అయినా కూడా పట్టుదలగా శ్రమించి ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.

<strong>స్వర్ణం గెలిచిన స్వప్న వాళ్ల ఊరికి కాంక్రీటు రోడ్డుని కూడా తీసుకొచ్చింది</strong>స్వర్ణం గెలిచిన స్వప్న వాళ్ల ఊరికి కాంక్రీటు రోడ్డుని కూడా తీసుకొచ్చింది

దీంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) ఆమె కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించి ఇచ్చేందుకు గాను ప్రముఖ బూట్ల తయారీదారు కంపెనీ ఆడిడాస్‌తో ఒప్పందం చేసుకుంది. వివిధ క్రీడలకు అవసరమైన ఐదు జతల బూట్లను స్వప్నకు ఇవ్వనుంది. జకార్తా వేదికగా జరిగిన 18వ ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్ ఈవెంట్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అనంతరం స్వప్న బర్నన్ మాట్లాడుతూ సాధారణ బూట్లు వేసుకోవడంతో తన కాళ్లకు ఉన్న అదనపు వేళ్ళు వల్ల నొప్పి పుడుతుందని, కుదిరితే తన కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయాల్సిందిగా అభ్యర్ధించిన సంగతి తెలిసిందే.

కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చొరవతో

కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చొరవతో

ఆమె ఆభ్యర్ధనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వెంటనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్)ను వెంటనే ఆమెకు ప్రత్యేకమైన బూట్లను అందించాల్సిందిగా ఆదేశించారు. ఈ విషయాన్ని శాయ్ డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్ తెలియజేశారు. "స్వప్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర క్రీడల మంత్రి జకార్తా నుంచే ఆమెకు ప్రత్యేకమైన బూట్లను అందించాల్సిందిగా ఆదేశించారు. వెంటనే మేము ప్రముఖ బూట్ల తయారీదారు కంపెనీ ఆడిడాస్‌తో మాట్లాడాం. స్వప్న కోసం ప్రత్యేకమైన బూట్లను తయారు చేసేందుకు వారు అంగీకరించారు" అని ఆయన తెలిపారు.

స్వప్న కోచ్ సుభాష్ సర్కార్‌ ఇలా

స్వప్న కోచ్ సుభాష్ సర్కార్‌ ఇలా

ఈ విషయాన్ని కోల్‌కతాలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న స్వప్న కోచ్ సుభాష్ సర్కార్‌కు శాయ్ అధికారులు తెలియజేశారని ఆయన స్పష్టం చేశారు. సుభాష్ సర్కార్ సైతం స్వప్న బూట్ల సైజు, డ్రాయింగ్స్‌ను మెయిల్ ద్వారా ఢిల్లీలోని శాయ్ హెడ్ క్వార్టర్స్‌కు వెల్లడించారని అన్నారు. దీనిపై సుభాష్ సర్కార్ మాట్లాడుతూ "అవును, స్వప్న బర్నన్ కోసం ప్రత్యేకమైన బూట్లు తయారు చేయించనున్నట్లు శాయ్ నుంచి నాకు సమాచారం అందించింది" అని అన్నారు. జకార్తా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వప్న బర్మన్ స్వర్ణం సాధించడం వల్లనే ఇది సాధ్యమైందని సర్కార్ అన్నారు.

 గతంలోనే శాయ్ అధికారులకు చెప్పా

గతంలోనే శాయ్ అధికారులకు చెప్పా

"సాధారణ బూట్లు వేసుకుని స్వప్న బర్మన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆమె ఇబ్బందికి గురువుతుందనే విషయాన్ని నేను గతంలోనే శాయ్ అధికారులకు చెప్పా. అయితే, వారు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఆసియా గేమ్స్‌కు ముందు బర్మన్ సైతం ఈ విషయాన్ని తేలికగానే తీసుకుని, సాధారణ బూట్లను తనకు అనుకూలంగా చిన్నపాటి మార్పులు చేయించుకుంది. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు ముందు కొత్త బూట్లతో బరిలోకి దిగడం మంచిది కాదు అనుకునే ఆమె ఈ నిర్ణయం తీసుకుంది" అని కోచ్ సర్కార్ తెలిపారు.

గతేడాది సెప్టెంబర్‌లో టాప్స్ స్కీమ్‌లో

గతేడాది సెప్టెంబర్‌లో టాప్స్ స్కీమ్‌లో

2012 నుంచి స్వప్న బర్మన్ కోల్‌కతాలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లోనే శిక్షణ పొందుతుంది. గతేడాది సెప్టెంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్స్)లో కూడా చోటు దక్కించుకుంది. స్వప్న బర్మన్‌ నేపథ్యంలోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌ గురి ప్రాంతంలో 1996, అక్టోబర్‌ 29న ఒక గిరిజన తెగకు చెందిన పంచానన్‌ బర్మన్‌, బసాన దంపతులకు జన్మించింది. తండ్రి రిక్షా కార్మికుడు, తల్లి తేయాకు తోటలో పనిచేసే దినసరి కూలీ.

Story first published: Friday, September 14, 2018, 16:06 [IST]
Other articles published on Sep 14, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X