న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సుదిర్మన్ కప్: నాకౌట్‌కు భారత్, ఈ సారైనా చైనాపై విజయం సాధిస్తుందా?

సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. గ్రూప్-డిలో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియా 3-2తో డెన్మార్క్‌పై గెలవడంతో భార

By Nageshwara Rao

హైదరాబాద్: సుదిర్మన్ కప్ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. గ్రూప్-డిలో భాగంగా బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇండోనేషియా 3-2తో డెన్మార్క్‌పై గెలవడంతో భారత్‌కు నాకౌట్‌కు అర్హత సాధించింది.

సుదిర్మన్‌ కప్‌: సింధు విజయంతో నాకౌట్‌ అవకాశాలు సజీవంసుదిర్మన్‌ కప్‌: సింధు విజయంతో నాకౌట్‌ అవకాశాలు సజీవం

మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో ఇండోనేషియాపై నెగ్గి నాకౌట్ ఆశలను సజీవంగా నిలుపుకున్న సంగతి తెలిసిందే. మూడు జట్లున్న ఈ గ్రూప్‌లో డెన్మార్క్‌ అగ్రస్థానంలో నిలిచి... భారత్‌ రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌ బెర్త్‌లను (క్వార్టర్‌ ఫైనల్స్‌) ఖాయం చేసుకున్నాయి.

Sudirman Cup: India qualifies for quarterfinals, will face China

లీగ్‌ దశ పోటీలు ముగిశాక గ్రూప్‌-డిలో డెన్మార్క్, భారత్, ఇండోనేసియా ఒక్కో విజయంతో సమ ఉజ్జీలుగా నిలిచాయి. అయితే మెరుగైన మ్యాచ్‌ విజయాల సంఖ్య ఆధారంగా డెన్మార్క్‌ (6), భారత్‌ (5) నాకౌట్‌కు అర్హత సాధించగా, ఇండోనేసియా 4 విజయాలతో ఇంటిముఖం పట్టింది.

శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాతో భారత్‌ తలపడుతుంది. ఈ టోర్నీలో భారత్ క్వార్టర్స్ చేరడం ఇది రెండోసారి. 2011లో భారత్ క్వార్టర్స్‌లో 1-3తో చైనా చేతిలో ఓడింది. ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో గ్రూ ప్ దశను దాటలేకపోయింది.

28 ఏళ్ల సుదిర్మన్‌ కప్‌ చరిత్రలో ఇండోనేసియా జట్టు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం ఇదే తొలిసారి. మరోవైపు ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకోవడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X