న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

9 ఏళ్ల ఉద్యోగ నిరీక్షణకు తెర: సవితకు కేంద్ర క్రీడల మంత్రి జాబ్ ఆఫర్

తొమ్మిదేళ్లుగా జాతీయ హాకీ జట్టుకు సేవలందిస్తూ, ఉద్యోగం ఎదురు చూస్తోందంటూ భారత గోల్ కీపర్ సవిత పూనియాపై జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు.

By Nageshwara Rao

హైదరాబాద్: తొమ్మిదేళ్లుగా జాతీయ హాకీ జట్టుకు సేవలందిస్తూ, ఉద్యోగం ఎదురు చూస్తోందంటూ భారత గోల్ కీపర్ సవిత పూనియాపై జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. ఇటీవల జరిగిన ఆసియా కప్ మహిళల హాకీ ఫైనల్లో భారత జట్టు 5-4 తేడాతో చైనాపై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆమెకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాథోడ్ తెలిపారు.

సవితకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందుతాయని రాథోడ్ బుధవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'ఏ విధంగా సహకారం కావాలో అన్నదానిపై మా అధికారుల బృందం ఆమెను ఇప్పటికే అడిగింది. ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం సవిత త్వరలోనే అందుకోనుంది' అని మంత్రి రాథోడ్ ట్వీట్ చేశారు.

 గోల్‌కీపర్‌గా సవిత ప్రధాన పాత్ర

గోల్‌కీపర్‌గా సవిత ప్రధాన పాత్ర

గతవారం జపాన్‌లో ముగిసిన ఆసియా కప్‌ మహిళల హాకీ ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో గోల్‌కీపర్‌గా సవిత ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా ఉండటంతో షూటౌట్ తప్పనిసరి అయ్యింది. షూటౌట్లో భారత్ వరుసగా ఐదు గోల్స్ సాధించగా.. చివరి గోల్ కోసం చైనా చేసిన ప్రయత్నాల్ని భారత గోల్ కీపర్ సవిత పూనియా సమర్థవంతంగా తిప్పికొట్టింది.

 రెండోసారి ఆసియా కప్ గెలిచిన భారత్

రెండోసారి ఆసియా కప్ గెలిచిన భారత్

దీంతో భారత్ రెండోసారి ఆసియా కప్ సాధించింది. ఈ విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే హాకీ ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించింది. హర్యానాలోని హిస్సార్‌కు చెందిన 27 ఏళ్ల సవిత పూనియా 2008లో అంతర్జాతీయ హాకీలో అరంగేట్రం చేసింది. అప్పటినుంచి జాతీయ జట్టులో ప్రతిసారీ చోటు దక్కించుకున్న సవిత ఇప్పటివరకు 150 మ్యాచ్‌లాడింది.

 ఉద్యోగం సాధించాలనే ఆమె కల మాత్రం నెరవేరలేదు

ఉద్యోగం సాధించాలనే ఆమె కల మాత్రం నెరవేరలేదు

హాకీలో ఆమె ఎన్నిసార్లు మెరుగైన ప్రదర్శన చేసినా, ఉద్యోగం సాధించాలనే ఆమె కల మాత్రం నెరవేరలేదు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ‘పతకం తీసుకు రండి - ఉద్యోగం సొంతం చేసుకోండి' పేరిట ఓ పథకాన్ని ప్రారంభించింది. కానీ సవిత పతకాలు తెస్తున్నా స్పందన లేకపోవడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

 ఇప్పటికీ నాన్న సంపాదన మీదే ఆధారపడుతున్నా

ఇప్పటికీ నాన్న సంపాదన మీదే ఆధారపడుతున్నా

‘నా వయసు 27 ఏళ్లు. తొమ్మిదేళ్లుగా హాకీ ఆడుతున్నా. కానీ ఇప్పటికీ నాన్న సంపాదన మీదే ఆధారపడుతున్నా. ఉద్యోగం వస్తుందని ఆశగా ఎదురు చూడటం, రాకపోవడం షరా మామూలైంది. అమ్మానాన్న బాధ్యతల్ని నేను మోయాల్సింది పోయి, వాళ్లకు భారంగా మారా. నాన్న ఒక్కడ సంపాదనతో కుటుంబం నడవడం కష్టంగా ఉంది' అని సవిత పేర్కొంది.

జట్టు విజయంలో నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది

జట్టు విజయంలో నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది

'రియో ఒలింపిక్స్ తర్వాత కోచ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. కానీ ఎలాంటి స్పందన లేదు. నేను తొమ్మిదేళ్లుగా భారత జట్టులో భాగంగా ఉన్నా. జట్టు విజయంలో నా పాత్ర ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో జరగబోయే మ్యాచ్‌ల్లోనూ నిరుద్యోగం నా ఆటతీరుపై ప్రభావం చూపకుండా మరింత కష్టపడతా' అని సవిత తెలిపింది. ఆసియా కప్ విజయంతోనైనా ఉద్యోగం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించడం విశేషం.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X