న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిఫరీ తప్పిదం: గెలిచి ఓడిన భారత బాక్సర్ వికాస్‌ కృష్ణన్‌

By Nageswara Rao
London Olympics: India rage over 'cheated' fighters
లండన్, ఆగస్టు 5: రిఫరీల తప్పుడూ నిర్ణయంతో ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాన్ని భారత బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌ చేజార్చుకున్నాడు. 69కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్‌లో వికాస్ 13-11 తేడాతో అమెరికాకు చెందిన ఎర్రల్ స్పెన్స్ (అమెరికా)పై నెగ్గాడు. అయితే ఈ ఫలితంపై అమెరికా బాక్సింగ్‌ సంఘం అమెచ్యూర్‌ బాక్సింగ్‌ సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన బాక్సింగ్‌ సంఘం వికాస్‌కు వ్యతిరేకంగా ఫలితాన్ని ప్రకటించింది. ఎర్రాల్‌కు అదనంగా నాలుగు పాయింట్లను కేటాయించారు. దీంతో వికాస్‌ అనూహ్యంగా 13-15 తేడాతో ఓటమి పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే 69కేజీల ప్రిక్వార్టర్స్ బౌట్‌లో వికాస్ 13-11 తేడాతో అమెరికాకు చెందిన ఎర్రల్ స్పెన్స్ (అమెరికా)పై నెగ్గగా.. ఈ ఫలితంపై అమెరికా టీమ్ మేనేజిమెంట్ అప్పీల్‌కు వెళ్లింది. దీంతో రివ్యూ చేసిన అనంతరం అంతర్జాతీయు బాక్సింగ్ అసోసియేషన్ (ఏఐబీఏ) 15-13తో స్పెన్స్ నెగ్గినట్టుగా ప్రకటించింది. ఈ బౌట్‌లో వికాస్ 9 ఫౌల్స్ చేశాడని, ఐతే రిఫరీ ఒక్కసారి వూత్రమే హెచ్చరించాడని జ్యూరీ సమీక్ష చేసిన అనంతరం ఏఐబీఏ వెల్లడించింది. అలాగే రెండో రౌండ్ 2.38 సవుయుం దగ్గర తన వత్‌గార్డ్‌ను ఉద్దేశపూర్వకంగా ఉమ్మేశాడని, ఇక్కడ కూడా రిఫరీ అతడికి ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదని పేర్కొంది. ఇవన్నీ గమనించాక స్పెన్స్‌కు నాలుగు పాయింట్లు ఇవ్వాలని జ్యూరీ నిర్ణయించింది.

ఏఐబీఏ టెక్నికల్ అండ్ కాంపిటీషన్ నిబంధనల ప్రకారం 12.1.9 ప్రకారం బౌట్ రిఫరీ వికాస్‌కు కనీసం రెండు హెచ్చరికలను అయినా ఇవ్వాలి. అదీగాకుండా వికాస్ కావాలనే తన వత్ షీల్డ్‌ను ఉమ్మేసినప్పుడు రిఫరీ గవునించకుండా అమెరికా బాక్సర్ వీపు అడ్డంగా ఉందని ఏఐబీఏ తెలిపింది. ఆ తర్వాత భారత బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌
ఓటమిపై అంతర్జాతీయ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (ఐబిఓ)కు భారత బృందం చేసిన ఫిర్యాదును తిరస్కరించింది.

69 కేజీల విభాగంలో జరిగిన పోటీలో వికాస్‌ కృష్ణ గెలిచినట్లు ముందుగా ప్రకటించిన రిఫరీ, తర్వాత అమెరికాకు చెందిన ప్రత్యర్థి ఎర్రోల్‌ స్పెన్స్‌ గెలిచినట్లు ప్రకటించారు. వివాదాస్పదమైన ఈ నిర్ణయ ప్రకటనలో వికాస్‌ గెలిచినట్లుగా ప్రకటించాలని భారత టీమ్‌ ఐబిఓను కోరింది. దీంతో భారత బాక్సర్ వికాస్ గెలిచి ఓడినట్లయింది.

దీంతో ఈ నిర్ణయాన్ని తాము అంగీకరించబోమని భారత చీఫ్‌ డి మిషన్‌ పికె మురళీధరన్‌ రాజా అప్పుడే ప్రకటించారు. అయితే ఇలాంటి విషయాల్లో న్యాయనిర్ణేతల సంఘానిదే తుది నిర్ణయం అని, తమ ముందు మరిన్ని అవకాశాలు లేవని ఆయన అన్నారు. అయినప్పటికీ దీనిపై మరోసారి అప్పీల్‌ చేస్తామని ప్రకటించారు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X