న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ద్రోహి అంటారా, డర్టీ పొలిటిక్స్: మహేష్ భూపతి ఫైర్

By Pratap
Mahesh Bhupathi
న్యూఢిల్లీ: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ)పై టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి తీవ్రంగా మండిపడ్డారు. సంఘం డర్టీ పొలిటిక్స్ అని ఆయన వ్యాఖ్యానించారు. తనపై ద్రోహిగా అభివర్ణించడాన్ని అంగీకరించబోనని ఆయన అన్నారు. లియాండర్ పేస్‌కు, తనకు మధ్య గల విభేదాలను ఎఐటిఎ అధ్యక్షుడు అనిల్ ఖన్నా అవకాశంగా తీసుకుంటున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తమపై రెండేళ్ల పాటు నిషేధం విధించడంపై వివరణ ఇవ్వాలని భూపతి, రోహన్ బోపన్న ఎఐటిఎ నుంచి వివరణ కోరుతూ అంతకు ముందు లేఖ రాశారు. తమపై నిషేధం విధించడానికి అనుసరించిన పద్ధతులేమిటో తెలియజేయాలని వారు డిమాండ్ చేశారు. ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్‌తో జత కట్టడానికి మహేష్ భూపతి నికారించడంతో అసలు సమస్య మొదలైంది.

అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ)పై తనపై విధించిన నిషేధాన్ని కోర్టులో సవాలు చేసే యోచనలో ఉన్నట్టు మహేష్ భూపతి సోమవారంనాడు తెలిపాడు. అయితే ఏఐటీఏ తీసుకున్న నిర్ణయం న్యాయపరంగా సరైనదేనా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పా డు. లండన్ ఒలింపిక్స్‌లో లియాండర్‌పేస్‌తో ఆడేందుకు నిరాకరించిన భూపతి/రోహన్ బోపన్నలను డేవిస్ కప్‌లో ఆడకుండా నిరోధించిన ఏఐటీఏ..తాజాగా ఆ నిషేధాన్ని 2014 ఏడాది జూన్‌దాకా పొడిగించిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై మంగళవారం మీడియా ముందుకు రానున్నట్టు భూపతి చెప్పాడు. 'రోహన్ దాదాపు పదేళ్లనుంచి భారత్‌కు ఆడుతున్నాడు. నేను కూడా 18 ఏళ్లనుంచి ఉన్నాను. ఇంత అనుభవమున్న మాపై నిషేధం చాలా దురుసు చర్య' అన్నాడు. ఏఐటీఏ తమపై తీసుకున్న ఈ చర్య కక్ష సాధింపుగా భూపతి అభివర్ణించాడు. ఈ డర్టీగేమ్‌లో తన సహచరుడు, మిత్రుడు కూడా అయిన బోపన్న చిక్కుకోవడం ఆవేదన కలిగిస్తోందని భూపతి వాపోయాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X