న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నచ్చినా నచ్చక పోయినా 'పేస్' తో ఆడాల్సిందే: ఏఐటీఏ

By Nageswara Rao
AITA refuses to budge, says will send Lee-Hesh to Olympics
బెంగళూరు, జూన్ 17: ఒలింపిక్స్ డబుల్స్‌లో ఆడే భారత జోడిని మార్చే ప్రసక్తే లేదని అఖిల భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) తేల్చి చెప్పింది. లియాండర్ పేస్‌తో ఆడడాన్ని మహేశ్ భూపతి వ్యతిరేకిస్తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని ఏఐటీఏ ఈ వ్యాఖ్యలు చేసింది. 'పేస్, భూపతి మరింత పరిణతితో ఆలోచించాలి. వారి మధ్య ఉన్న విభేదాల కన్నా జాతి ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. సమాఖ్య మీద ఒత్తిడి తెస్తే జట్టును మార్చుతారని భూపతి అనుకుంటే పొరపాటు' అని భారత టెన్నిస్ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా అనిల్ ఖన్నా అన్నారు.

ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న అనిల్ ఖన్నా శనివారం జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏకగ్రీవంగా కొత్త ఆఫీస్ బేరర్ల ఎంపిక జరిగింది. ఈ ఎంపికలో గత 12 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న యశ్వంత్ సిన్హా స్థానంలో అనిల్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రధాన కార్యదర్శిగా భరత్ ఓజా, సంయుక్త కార్యదర్శిగా సీఎస్ సుందర్ రాజు, కోశాధికారిగా రక్తిమ్ సిఖియా ఎంపికయ్యారు.

ఇది ఇలా ఉంటే ఒలింపిక్స్‌లో లియాండర్ పేస్‌తో కలిసి ఆడే సమస్యే లేదని మహేశ్ భూపతి అంటున్నా పేస్ మాత్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేశాడు. సెలక్షన్ కమిటీ ఎవరిని ఎంపిక చేసినా తనకు అభ్యంతరం లేదని, రోహన్ బోపన్నతో కలిసి లండన్ ఒలింపిక్స్ డబుల్స్‌లో ఆడాలని భూపతి భావిస్తుండగా భారత టెన్నిస్ సమాఖ్య (ఏఐటీఏ) మాత్రం పేస్, భూపతితో జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై భూపతి, లియాండర్ పేస్‌తో తాను జత కట్టేది లేదని నిరసన వ్యక్తం చేశాడు.

'ఇటీవల మీడియాతో భూపతి చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించను. ఏఐటీఏ, సెలక్షన్ కమిటీ ఎవరిని ఎంపిక చేసినా వారితో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. అంతకుముందు డబుల్స్ భాగస్వామిగా రోహన్ బోపన్నతో కలిసి ఆడాలని అనుకుంటున్నట్టు ఏఐటీఏ అడిగినపుడు చెప్పాను. అతడి ఫిజికల్ ఫిట్‌నెస్, భారీ సర్వీస్‌లను దృష్టిలో ఉంచుకుని అలా చెప్పాల్సి వచ్చింది. నా కెరీర్‌లో అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్య పతకం మధురానుభూతిగా నిలిచింది. జాతీయ పతాకం కింద ఒలింపిక్స్‌లో ఆరోసారి భారత్ తరపున ఆడడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను' అని పేస్ తెలిపాడు. గత నవంబర్ నుండి మా ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని అన్నాడు.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X