న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారు మాత్రమే చెప్పగలరు ఆకాశానికి హద్దు ఉంటుందని: ఫిట్ ఇండియా కార్యక్రమంలో మోడీ

Sky Is The Limit For Those Who Stay Fit, Says PM At Fit India Launch

హైదరాబాద్: ఫిట్‌గా ఉన్న వాళ్లు మాత్రమే ఆకాశానికి హద్దు ఉంటుందని చెప్పగలరని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని యువత ఫిట్‌గా ఉంటేనే దేశం ఫిట్‌గా ఉంటుందనే ఉద్దేశంతో ప్రధాని మోడీ ఫిట్ ఇండియా ఉద్యమానికి గురువారం పిలుపునిచ్చారు.

సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్సానియా మిర్జా పేరు సడన్‌గా పీటీ ఉషగా: విశాఖ బీచ్‌రోడ్‌లో ఫోటో వైరల్

ప్రతి ఏటా ఆగస్టు 29న

హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధాని మోడీ ఫిట్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పాల్గొన్నారు.

ప్రధాని మాట్లాడుతూ

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ "ఫిట్‌నెస్ అనేది ఎల్లప్పుడూ మన సంస్కృతిలో భాగంగా ఉంది. అయితే, ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్ సమస్యలపై ఉదాసీనత ఏర్పడింది. కొన్ని దశాబ్దాల క్రితం ఒక సాధారణ వ్యక్తి రోజులో 8-10 కిలోమీటర్లు నడుస్తాడు లేదా పరిగెత్తడం. సైక్లింగ్ చేస్తాడు. ఇప్పుడు సమయాభావం, పనులు భిన్నంగా ఉండటం వల్ల ఫిట్నెస్‌కు దూరమవ్వాల్సి వస్తోంది" అని అన్నారు.

బలమైన దేశం అదే

బలమైన దేశం అదే

"కాలం మారిపోయింది. సాధారణంగా ప్రజలు సైకిల్ లేదా నడకను ఆశ్రయించాలి. సాంకేతికత పెరిగిన కారణంగా ఎంత నడిచామనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అందివచ్చిన టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకోవాలి. ప్రస్తుతం జీవనశైలి లోపాలు పెరుగుతున్నాయి. మన ఆరోగ్యం, శ్రేయస్సు మన నియంత్రణలో ఉండాలి. ఫిట్‌నెస్ అనేది ఇండియాలో ఓ ఉద్యమం కాదు. ప్రపంచ వ్యాప్తంగా దీనిని సీరియస్‌గా తీసుకుంటున్నారు. చైనా చాలా పెద్దఎత్తున 'హెల్తీ చైనా' అనే క్యాంపెయిన్‌ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం 2030 నాటికి చైనాలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆరోగ్యకరమైన ప్రజలు ఉన్న దేశం బలమైన దేశం' అని మోడీ ఈ సందర్భంగా తెలిపారు.

కశ్మీరీలకు సంఘీభావం.. పాక్ ఆర్మీ నిరసనలో షాహిద్ అఫ్రిది!!

విజయానికి ఫిట్‌నెస్‌కు కనిపించని బంధం

"సక్సెస్‌లో ఎలాంటి ఎలివేటర్ ఉండదు(ముఖ్యంగా ఫిట్‌నెస్ విషయంలో). నువ్వు మెట్లు ఎక్కాల్సిందే. నిజం చెప్పాలంటే విజయానికి ఫిట్‌నెస్‌కు కనిపించని బంధం ఉంది. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే తప్ప మీరు దేనిలోనూ విజయం సాధించలేరు" అని ప్రధాని మోడీ దేశ ప్రజలకు విలువైన సూచన చేశారు.

జాతీయ అభివృద్ధిలో ఫిట్‌నెస్ అనేది కీలక పాత్ర

జాతీయ అభివృద్ధిలో ఫిట్నెస్ అనేది కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. అంతకముందు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మోడీ.. ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని అభినందించారు. గొప్ప క్రీడాకారుడి జన్మదినం సందర్భంగా ఈ రోజు క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు మోడీ తెలిపారు. ధ్యాన్‌చంద్ తన ఫిట్‌నెస్, స్టామినా, హాకీ స్టిక్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారని గుర్తు చేశారని అన్నారు. 11 మంది మంత్రుల నేతృత్వంలో ఈ ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

Story first published: Thursday, August 29, 2019, 13:13 [IST]
Other articles published on Aug 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X