Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్మీరీలకు సంఘీభావం.. పాక్ ఆర్మీ నిరసనలో షాహిద్ అఫ్రిది!!

Shahid Afridi To Visit Loc To 'Express Solidarity With Kashmiri Brethren' || Oneindia Telugu
Shahid Afridi to visit LoC, Express Solidarity With Kashmiri Brethren

ఇస్లామాబాద్: కశ్మీరి ప్రజలకు సంఘీభావంగా పాకిస్థాన్‌లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆర్మీ చేపట్టే నిరసన కార్యక్రమంలో తాను పాలుపంచుకుంటానని ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపాడు. కశ్మీరీ ప్రజలకు సంఘీభావంగా ప్రతీ శుక్రవారం 'కశ్మీర్ అవర్' పేరిట ఓ కార్యక్రమం చేపడతామని పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

 'కశ్మీర్ అవర్:

'కశ్మీర్ అవర్:

ఈ నెల 30వ తేదీన శుక్రవారం 12 గంటలకు 'కశ్మీర్ అవర్' పేరిట సంఘీభావం కోసం సైరన్ మోగిస్తాం. ఈ నిరసన కార్యక్రమంలో పాక్ ప్రజలందరూ పాల్గొనాలని ఆర్మీ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ప్రకటించారు. పాక్ ఆర్మీ ప్రకటన అనంతరం కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా చేపట్టనున్న నిరసనలో తాను కూడా పాల్గొంటానని షాహిద్ అఫ్రీది ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

ప్రధాని ఖాన్ పిలుపుకు మద్దతు ఇద్దాం:

'ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పిలుపుకు మద్దతు ఇద్దాం. శుక్రవారం మధ్యా హ్నం 12 గంటలకు మజర్ ఈ ఖైద్ (జిన్నా సమాధి)ని సందర్శిస్తా. కశ్మీరీ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు నాతో చేతులు కలపండి. సెప్టెంబర్ 6న ఓ అమర జవాన్ ఇంటికి వెళతా. త్వరలో ఎల్‌వోసీకి కూడా వెళతా' అని అఫ్రిదీ ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చాడు. కశ్మీర్‌కు సంఘీభావంగా పాక్ ఆర్మీ నిరసనలో రేపు అఫ్రిదీ పాల్గొననున్నాడు.

 ఆర్టికల్ 370ని రద్దు:

ఆర్టికల్ 370ని రద్దు:

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలిగించి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా భారత ప్రభుత్వం ఈ నెల ఆరంభంలో విభజించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌పై పాక్ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. చివరకు క్రికెట్ ఆటగాళ్లు కూడా.

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌.. శుబ్‌మన్‌ గిల్‌పైనే అందరి దృష్టి

Story first published: Thursday, August 29, 2019, 11:23 [IST]
Other articles published on Aug 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+