న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నటుడు మాధవన్ పుత్రోత్సాహం: భారత్‌కు మెడల్ తెచ్చిన కుమారుడు

See pic: Madhavans son Vedaant wins silver for India in Asian Age Group Championship

హైదరాబాద్: సినీ నటుడు మాధవన్‌ని అతడి కుమారుడు గర్వపడేలా చేశాడు. ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌లో మాధవన్ కుమారుడు వేదాంత్ రజత పతకం సాధించాడు. తండ్రితో పాటు దేశాన్నీ గర్వపడేలా చేశాడు. ఆసియా ఏజ్ గ్రూప్ ఛాంపియన్‌షిప్‌ గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత్ తరుపున వేదాంత్‌తో పాటు మరో ముగ్గురు ఈ పోటీలో పాల్గొన్నారు.

ఈ పోటీలో వేదాంత్‌ (55.27 సె), ఉత్కర్ష్‌ పాటిల్‌ (57.10 సె), సాహిల్‌ లష్కర్‌ (54.83 సె), సోహన్‌ గంగూలీ (54.29 సె)తో కూడిన బృందం 3:41:49 సెకన్లలో ముగించింది. ఫలితంగా రెండో స్థానంలో నిలిచి వేదాంత్ టీమ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

మాధవన్ తన ఇనిస్టాగ్రామ్‌లో

మాధవన్ తన ఇనిస్టాగ్రామ్‌లో

ఈ విషయాన్ని మాధవన్ తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా "ఆసియా గేమ్స్‌లో ఇండియా రజత పతకం సాధించింది. దేవుడి ఆశీస్సులతో... భారత్ తరుపున వేదాంత్ తన మొట్టమొదటి పతకాన్ని సాధించాడు" అంటూ కామెంట్ పెట్టాడు.

వేదాంత్ వయసు 14 ఏళ్లు

వేదాంత్ వయసు 14 ఏళ్లు

ప్రస్తుతం వేదాంత్ వయసు 14 ఏళ్లు. స్విమ్మింగ్ అతడికి ప్రాణం. స్విమ్మింగ్‌లో ఇప్పటికే పలు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అంతకముందు కూడా మాధవన్ తన కుమారుడు సాధించిన పతకాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

భారత్‌కు రజత పతకం

భారత్‌కు రజత పతకం

భారత్‌కు రజత పతకం అందించిన వారిలో వేదాంత్‌తో పాటు అతడి టీమ్‌లో ఉత్కర్ష్ పాటిల్, సాహిల్ లాస్కర్ మరియు షోన్ గంగూలీలు ఉన్నారు. గ్రూప్ IIలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో థాయిలాండ్ స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించగా... జపాన్ స్విమ్మర్లు కాంస్య పతకం సాధించారు.

గతేడాది థాయిలాండ్‌లో

గతేడాది థాయిలాండ్‌లో

ఇదిలా ఉంటే, గ్రూప్ Iలో 4x100మీటర్ల ఫ్రీ స్టైల్ రిలేలో భారత స్విమ్మర్లు స్వర్ణ పతకం సాధించారు. కాగా, గతేడాది థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ మీట్‌లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించి కాంస్య పతకం సాధించాడు. మరోవైపు వేదాంత్ తండ్రి మాధవన్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

Story first published: Thursday, September 26, 2019, 17:55 [IST]
Other articles published on Sep 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X