న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెండేళ్ల తర్వాత సంజిత చానూకు అర్జున అవార్డు!!

Sanjita Chanu Cleared Of Doping Charges, To Get Arjuna Award For 2018


ఢిల్లీ: వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు అందుకోనున్నారు. సంజిత డోపింగ్‌కు పాల్పడలేదని తేలడంతో.. 2018లో నిలుపుదల చేసిన అర్జున అవార్డును ఇప్పుడు ఆమె చెంత చేరనుంది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్‌) ఈ భారత లిఫ్టర్‌పై ఉన్న అన్ని డోపింగ్‌ నేరాలను ఎత్తేయడంతో.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల అనుగుణంగా సంజితకు అర్జునను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు గురువారం తెలిపాయి.

2016, 17 సంవత్సరాల్లో ఈ పురస్కారానికి సంజిత చాను దరఖాస్తు చేసుకున్నా పరిశీలనకు నోచుకోలేదు. 2017లో తన పేరు జాబితా నుంచి తొలగించడంపై ఢిల్లీ హైకోర్టులో సంజిత ఓ రిట్‌ పిటిషన్‌ వేశారు. అయితే ఈ కేసు నడుస్తుండగానే.. ఆమె 2018 మేలో డోపింగ్‌ కేసులో ఇరుక్కున్నారు. సంజిత పేరును అవార్డుకు పరిగణించాలని.. ఆమె డోపింగ్‌కు పాల్పడలేదని తేలిన తర్వాత నిర్ణయాన్ని వెలువడించాలని ఆ ఏడాది ఆగస్టులో అవార్డుల కమిటీని హైకోర్టు ఆదేశించింది.

సంజితకు అర్జున అవార్డు ఖరారైందని త్వరలోనే అందజేస్తారని భారత వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి చెప్పారు. 2014, 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో సంజిత స్వర్ణ పతకాలు సాధించారు. 'సంజితపై ఉన్న అన్ని డోపింగ్‌ అభియోగాలను అంతర్జాతీయ సమాఖ్య తొలగించింది. అందుకే 2018లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుసరించి.. అర్జున అవార్డు కోసం ఆమె పేరును పరిగణనలోకి తీసుకుంటాం' అని కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి చెప్పా రు.

డోపింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజిత చానుకు ఇటీవలే ఊరట లభించింది. ఏ తప్పు చేయలేదని చెప్పినప్పటికీ డోపింగ్‌ పేరుతో తనను మానసిక క్షోభకు గురి చేశారని, దానికి తగిన మూల్యం చెల్లించాలని ఐడబ్ల్యూఎఫ్‌ను సంజీత చాను డిమాండ్‌ చేసారు. 'డోపింగ్‌ వివాదం నుంచి బయటపడ్డందుకు ఆనందంగా ఉంది. కానీ దాని వల్ల నేను కోల్పోయిన అవకాశాల మాటేమిటి, నాకు జరిగిన మానసిక గాయాన్ని ఎవరు నయం చేస్తారు, శాంపిల్‌ను పరీక్షించే క్రమంలో ప్రతి దశలోనూ జరిగిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు' అని ప్రశ్నించారు.

<strong>హార్దిక్.. నీ కళ్లు కృనాల్‌ మీదే ఉన్నాయి: కోహ్లీ</strong>హార్దిక్.. నీ కళ్లు కృనాల్‌ మీదే ఉన్నాయి: కోహ్లీ

Story first published: Friday, June 26, 2020, 7:33 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X