న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సల్మాన్ ఎంపిక: మిల్కా అసంతృప్తి, ఏం చేశారని దత్

By Nageswara Rao

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై 'ప్లయింగ్ సిఖ్'గా పేరుగాంచిన భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్‌ మిల్ఖాసింగ్‌ తప్పబట్టారు. ముఖ్యంగా భారత ప్రభుత్వ నిర్ణయంపై ఆయనతో పాటు పలువురు క్రీడాకారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే సల్మాన్‌ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్యా ఆయనను తొలగించాలని సూచించారు.

ఒక క్రీడాకారునిగా చూస్తే షూటింగ్, అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లే భారత్‌కు నిజమైన రాయబారులని అన్నారు. క్రీడా రాయబారిగా ఎవరినైనా అంబాసిడర్‌గా నియమించాలని భావిస్తే వారు తప్పకుండా క్రీడారంగానికి చెందినవారైతే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశం ఎంతో గొప్ప క్రీడాకారులను అందించిందని, అందులో పీటీ ఉష, రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, అజిత్ పటేల్ లాంటి వాళ్లు భారత దేశం కోసం చెమటను, రక్తాన్ని ధారపోశారని కొనియాడారు. వీరిలో ఎవరో ఒకరు గుడ్‌విల్ అంబాసిడర్ అయితే బాగుండేదని అన్నారు.

 Rio Olympics: Milkha Singh Upset With Salman Khan's Appointment as Goodwill Ambassador

బాలీవుడ్‌కు చెందిన ఓ వ్యక్తిని ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మరోవైపు రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టాడు. గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమంచడానికి సల్మాన్‌కు ఉన్న అర్హతలేమిటని, క్రీడలకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు.

అంతేకాకుండా, సినిమా ప్రమోషన్లకు ఒలింపిక్ క్రీడలు వేదికగా కాకూడదంటూ యోగేశ్వర్ దత్ విమర్శించారు. ఈ ఏడాది ఆగస్టులో జరిగే ప్రతిష్టాత్మక రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టుకు గుడ్‌విల్‌ అంబాసిడర్‌‌గా బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నియమించిన సంగతి తెలిసిందే.

నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా పోటీల్లో పాల్గొనే భారత బృందాన్ని ఉత్సాహపరిచేందుకు భారత ఒలింపిక్‌ సమాఖ్య (ఐవోఏ) ఈ నిర్ణయం తీసుకుంది. బాక్సర్‌ మేరీ కోమ్‌, హాకీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌, స్టార్‌ షూటర్‌ అపూర్వీ చండీలా తదితరుల సమక్షంలో సల్మాన్‌ పేరును శనివారం ప్రకటించింది.

ఈ నియామకాన్ని ఐవోఏ తనకిచ్చిన గౌరవంగా భావిస్తున్నట్టు సల్మాన్‌ ఈ సందర్భంగా చెప్పాడు. 'భారత అథ్లెట్లు అద్భుతంగా రాణిస్తూ దేశ ఖ్యాతిని పెంచుతున్నారు. రియోలో కూడా వారు మంచి ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తున్నా. వారిని ప్రోత్సహించేందుకు అందరూ చేయి కలిపితే.. రియో మనకు అత్యుత్తమ ఒలింపిక్స్‌గా మారుతుంద'ని అన్నాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X