న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒలింపిక్ ప్రారంభ వేడుక ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరు?

బ్రెజిల్: రియో ఒలింపిక్స్ 2016 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్లు బ్రెజిల్ వస్తున్నారు. ఈ ఒలింపిక్స్ ఆగస్టు 5వ తేదీన అధికారికంగా ప్రారంభం కానుంది. ఓపెనింగ్ సెరామనీ అదిరిపోనుంది. బ్రెజిల్ తొలిసారి ఒలింపిక్స్ నిర్వహిస్తోంది.

డోపింగ్, అథ్లెట్ గ్రామాల్లో జికా వైరస్.. తదితర ఇష్యూల మధ్యనే ఆటగాళ్లకు ఒలింపిక్స్ ఆహ్వానం పలుకుతోంది. పదివేల మందికి పైగా ఆటగాళ్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటారు. 19 రోజులు జరగనున్నాయి. భారత్ తొలిసారి 119 మందితో పెద్ద జట్టును పంపిస్తోంది.

Rio Olympics 2016: Opening Ceremony start time in IST, TV channel and other information

ఓపెనింగ్ సెరామనీ ఎప్పుడు?

ఒలింపిక్స్ వేడుకలు అధికారికంగా ఆగస్టు 5వ తేదీన ప్రారంభం కానున్నాయి. రియో డీ జెనీరోలోని మరకన స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ స్టేడియంలో 78,000 మంది పడతారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం నాడు రాత్రి 8 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆ సమయంలో... భారత్‌లో ఆగస్టు 6 (శనివారం) వేకువ జామున 4.30గంటలు.

టెలికాస్ట్

స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఓపెనింగ్ సెరామనీని టెలికాస్ట్ చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ 1, 2, 3, 4లతో పాటు హై డెఫినిషన్ చానల్స్ ప్రసారం చేస్తాయి. ఈ ఛానల్స్ ఓపెనింగ్ సెరామనీతో పాటు ఆటలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులు దక్కించుకున్నాయి. హిందీ, ఇంగ్లీష్‌లలో కామెంటరీ వస్తుంది.

ఒలింపిక్ జ్యోతి వెలిగించేది ఎవరంటే..

బ్రెజిల్ లెజెండ్, మాజీ ఫుట్‌పాల్ ఆటగాడు పీలే ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. అంతేకాదు, అతను ఒలింపిక్స్ కోసం 'ఎస్పెరాంకా' అనే పాటను కంపోస్ చేశాడు. సమాచారం మేరకు బ్రెజిల్ సూపర్ మోడల్ జిసెల్ కూడా ఓపెనింగ్ సెరామనీలో పాల్గొనున్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:22 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X