న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

#5MinuteAur: కేంద్ర క్రీడల మంత్రి కొత్త ఛాలెంజ్ ఇదే (వీడియో)

Rajyavardhan Rathore plays table-tennis with both hands to start #5MinuteAur challenge

హైదరాబాద్: 'హమ్‌ ఫిట్‌తో ఫిట్‌ ఇండియా ఫిట్‌' అనే ఛాలెంజ్‌‌తో గతేడాది సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరతీసిన కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ తాజాగా మరో ఛాలెంజ్‌తో నెటిజన్ల ముందుకొచ్చారు. ఖేలో ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా పిల్లలకు మరింతగా ఆడుకునే అవకాశం కల్పించాలని కోరుతూ ఈ కొత్త ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు.

వాట్సప్ గేమ్ ఎంత పనిచేసింది?: నిద్రపోతున్న యువతిని రేప్ చేసిన క్రికెటర్వాట్సప్ గేమ్ ఎంత పనిచేసింది?: నిద్రపోతున్న యువతిని రేప్ చేసిన క్రికెటర్

భారతదేశం ఒక గొప్ప క్రీడా దేశం కావాలని... ఇందులో భాగంగా చిన్నదశలోనే ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడటం ఒక సంస్కతిగా నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన వాళ్లంతా #5MinuteAur పేరుతో వీడియోలు పోస్ట్ చేయాలని సూచించారు. మరింతగా ఆడుకోవాలని ఆశపడే పిల్లలకు అండగా ఉండాలని సూచించారు.

వీడియోని పోస్టు చేసిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

ఈ సందర్భంగా తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, సల్మాన్ ఖాన్, సైనా నెహ్వాల్, దీపికా పదుకొణెలకు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని ఆహ్వానించారు.

భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో

భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో

కాగా, గతేడాది భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో 'హమ్‌ ఫిట్‌తో ఫిట్‌ ఇండియా ఫిట్‌' అనే ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాథోడ్ తన కార్యాయలంలోనే 10 డిప్స్ కొడుతూ షూట్ చేసిన వీడియోను సోషల్‌మీడియా ద్వారా షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ప్రతీ ఒక్కరూ ఇలా

ప్రతీ ఒక్కరూ ఇలా ఫిట్‌నెస్ మంత్రలో పాల్గొనాలని అప్పట్లో ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియోలో 'ప్రధాని మోడీని చూసినప్పుడల్లా స్పూర్తి పొందుతాను. ఆయన చాలా శక్తివంతుడు. రోజంతా పనిచేస్తునే ఉంటారు. భారత ప్రజలు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ఆయన ఎప్పుడు పరితపిస్తుంటారు. ఫిట్‌నెస్‌పై ప్రధాని మాట్లాడిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపజేశాయి' అని ఆయన అన్నారు.

Story first published: Wednesday, January 9, 2019, 13:02 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X