న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెస్ వరల్డ్ చాంపియన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత కుర్రాడు!

R Praggnanandhaa stuns Magnus Carlsen again

చెస్‌ వరల్డ్‌ చాంపియన్‌.. నార్వే గ్రాండ్‌మాస్టర్‌ మాగ్నస్ కార్ల్ సెన్‌కు 16 ఏళ్ల భారత యంగ్ గ్రాండ్‌మాస్టర్‌ రమేశ్‌బాబు ప్రజ్ఞానంద మరోసారి గట్టి షాకిచ్చాడు. చెస్బుల్ మాస్టర్స్ ఆన్‌లైన్‌ రాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో అనూహ్య రీతిలో కార్ల్‌సెన్‌ను ప్రజ్ఞానంద ఓడించాడు. ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద.. కార్ల్ సెన్ తలపడ్డాడు. డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో కార్ల్ సెన్ 40వ ఎత్తుగడలో పెద్ద తప్పు చేశాడు.

దీన్ని అందిపుచ్చుకున్న ప్రజ్ఞానంద కార్ల్ సెన్కు చెక్‌ పెట్టి.. మ్యాచ్‌ను కైవసం చేసుకోవడంతో పాటు 12 పాయింట్లు సాధించాడు. కార్ల్ సెన్పై గెలుపుతో ప్రజ్ఞానంద నాకౌట్‌ స్టేజ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాడు. ఓవరాల్‌గా చెస్బుల్ మాస్టర్స్‌లో రెండోరోజు ముగిసేసరికి కార్ల్ సెన్ 15 పాయింట్లతో మూడో స్థానంలో.. 12 పాయింట్లతో ప్రజ్ఞానంద ఐదో స్థానంలో ఉన్నాడు.

ఇక కార్ల్ సెన్‌ను ప్రజ్ఞానంద ఓడించడం ఇది రెండోసారి. ఇంతకముందు గత ఫిబ్రవరిలో ఆన్‌లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో కేవ‌లం 39 ఎత్తుల్లోనే కార్ల్‌సెన్‌ను చిత్తుగా ఓడించి ప్రజ్ఞానంద సంచ‌ల‌నం సృష్టించాడు. తమిళనాడుకు చెందిన‌ ప్రజ్ఞానంద.. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి, భారత దిగ్గజ‌ చెస్ ప్లేయర్ విశ్వనాథన్‌ ఆనంద్ రికార్డును బ్రేక్ చేశాడు. విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకోగా, ప్రజ్ఞానంద 12 ఏళ్ల వయసులోనే ఆ రికార్డును బ‌ద్దలు కొట్టాడు. ఈ క్రమంలో గ్రాండ్ మాస్టర్ హోదా ద‌క్కించుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా ప్రజ్ఞానంద ప్రపంచ రికార్డు నెల‌కొల్పాడు.

విజయం తర్వాత ప్రజ్ఞానంద మాట్లాడిన తీరు అందర్ని ఆకట్టుకుంది. 'ఇదొక గొప్ప విజయం. అలా అని గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ విజయానికి ఉప్పొంగిపోయి నేను సంబరాలు చేసుకోను. ఎందుకంటే చెస్‌లో గెలుపు, ఓటములు సహజం. కొనిసార్లు గెలుస్తాం.. మరికొన్ని సార్లు ఓడిపోతుంటాం. ఓటమి ఎప్పుడూ ముగింపు కాదు.'అంటూ తన వయసుకు మించిన పరిణతితో మాట్లాడాడు.

Story first published: Saturday, May 21, 2022, 18:02 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X