న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Paralympics : భారత్ ఖాతాలో 11వ మెడల్.. హై జంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం!!

Paralympics 2020 Live updates in Telugu: Today events highlights

పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటారు. దాంతో ఆదివారం ఒక్కరోజే భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి.టేబుల్ టెన్నిస్‌లో భవీనా పటేల్ రజతం గెలవగా.. హైజంప్ విభాగంలో నిషధ్ కుమార్ కూడా రజతం తెచ్చాడు. ఇక డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ కాంస్యం గెలిచాడు. పతకాలు గెలిచిన అథ్లెట్లపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సాధారణ ప్రజల వరకు పతకవిజేతలను కొనియాడుతున్నారు.

Aug 30, 2021, 11:16 am IST

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకున్న షూటర్ స్వరూప్ ఉన్హల్కర్

Aug 30, 2021, 11:15 am IST

ఒకే పోడియంపై ఇద్దరు భారతీయులు. జావెలెన్‌ త్రోలో రజత, కాంస్య పతకాలు సాధించిన దేవేంద్ర, సుందర్‌లు

Aug 30, 2021, 9:30 am IST

జావెలిన్ త్రోలో కాంస్య పతకాన్ని సాధించిన సుందర్‌ను అభినందిస్తూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

Aug 30, 2021, 9:29 am IST

జావెలిన్ త్రోలో రజత పతకం సాధించిన దేవేంద్రను అభినందిస్తూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

Aug 30, 2021, 9:28 am IST

పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అవని లేఖ్రాను అభినందించిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. అద్భుతమైన ప్రదర్శన కనబర్చారంటూ కితాబు

Aug 30, 2021, 9:27 am IST

పారాలింపిక్స్‌లో షూటింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన అవని లేఖ్రా, డిస్కస్ త్రోలో రజతం సాధించిన యోగేష్ కతునియాలను అభినందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Aug 30, 2021, 9:20 am IST

పారాలింపిక్స్‌ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్‌లో అడుగుపెట్టిన స్వరూప్ ఉన్హల్కర్

Aug 30, 2021, 9:20 am IST

హర్యానాలోని బహదుర్‌ఘర్‌లో ఉన్న యోగేష్ ఇంటివద్ద సంబురాలు. మిఠాయిలు పంచుతూ నాట్యం చేసిన కుటుంబ సభ్యులు. టోక్యో పారాలింపిక్స్‌లో యోగేష్ డిస్కస్ త్రోలో రజత పతకం సాధించాడు

Aug 30, 2021, 9:18 am IST

పారాలింపిక్స్ డిస్కస్ త్రో విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత భావోద్వేగానికి గురైన యోగేష్ కతునియా...

Aug 30, 2021, 9:17 am IST

ఈ రోజు నా ఆనందానికి హద్దులు లేవు. నా కొడుకు దేశం గర్వపడేలా చేశాడు. సిల్వర్ మెడల్ సాధించినా అది నాకు స్వర్ణపతకంతోనే సమానం.: యోగేష్ కతునియా తల్లి మీనాదేవి

Aug 30, 2021, 9:15 am IST

డిస్కస్ త్రోలో యోగేష్ కతునియా రజతపతకం సాధించడంతో హర్యానాలోని తన ఇంట్లో సంబరాలు చేసుకుంటున్న కుటుంబ సభ్యులు

Aug 30, 2021, 8:48 am IST

సోమవారం రోజు భారత్‌కు పారాలింపిక్స్‌లో పతకాల పంట కొనసాగుతోంది. డిస్కస్ త్రోలో యోగేష్ ఖాతున్య రజత పతకం సాధించారు.

Aug 30, 2021, 8:45 am IST

249.6తో అవని పారాలింపిక్ రికార్డును నెలకొల్పడమే కాకుండా ప్రపంచ రికార్డును సమం చేసింది

Aug 30, 2021, 8:43 am IST

పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం.. 10మీ షూటింగ్‌లో స్వర్ణం సాధించిన అవని లేఖ్రా

Aug 29, 2021, 6:24 pm IST

భారత్ ఖాతాలో మరో పతకం

డిస్కస్ త్రో‌లో భారత అథ్లెట్ వినోద్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. డిస్కస్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు.

Aug 29, 2021, 5:45 pm IST

భారత్ ఖాతాలో మరో పతకం

హైజంప్: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్ విభాగంలో నిషద్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు.

Aug 29, 2021, 5:21 pm IST

హై జంప్: 2.15 మీటర్ల ఎత్తును క్లియర్ చేసి ప్రపంచ రికార్డు బ్రేక్ చేసిన అమెరికా పారా జంపర్ రొడెరిక్ టౌన్‌సెండ్. మెరుగైన రికార్డు కోసం ప్రయత్నం.

Aug 29, 2021, 5:20 pm IST

హై జంప్: నిషద్, డల్లాస్ మధ్య సిల్వర్ మెడల్ కోసం టై. ఇద్దరూ 2.12 మీటర్ల ఎత్తును మూడు ప్రయత్నాల్లో అధిగమించలేకపోయారు. రొడెరిక్ టౌన్‌సెండ్ 2.12 మీటర్లను క్లియర్ చేసి స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. వరల్డ్ రికార్డు 2.15 మీటర్లపై కన్నేసాడు.

Aug 29, 2021, 5:17 pm IST

హై జంప్: 2.02 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన నిషద్

Aug 29, 2021, 5:16 pm IST

హై జంప్: మూడో ప్రయత్నంలోనూ రాంపాల్ 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు. అయినప్పటికీ అతను మూడో స్థానంలో ఉన్నాడు.

Aug 29, 2021, 4:40 pm IST

హై జంప్: రెండో ప్రయత్నంలో 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన నిషద్.

Aug 29, 2021, 4:40 pm IST

హై జంప్: 1.98 మీటర్ల ఎత్తును క్లియర్ చేయడంలో విఫలమైన నిషద్. అతనికింకా రెండు చాన్సెస్ ఉన్నాయి. అంతకుముందు రాంపాల్ చాహర్‌ తన రెండో ప్రయత్నంలో 1.94 మీటర్లను క్లియర్ చేసి ముందంజ వేసాడు. ఇంకా ఐదుగురు జంపర్స్ మిగలగా.. అందులో ఇద్దరు భారతీయులున్నారు.

Aug 29, 2021, 4:37 pm IST

హై జంప్: 1.94 మీటర్ల ఎత్తును క్లియర్ చేసిన నిషద్ కుమార్. తొలి ప్రయత్నంలో విఫలమైన రాంపాల్

Aug 29, 2021, 4:35 pm IST

భవీనాకు గుజరాత్​ సర్కారు భారీ నజరానా

టోక్యో పారాలింపిక్స్​లో రజతం సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్​కు గుజరాత్​ ప్రభుత్వం. రూ. 3 కోట్ల భారీ నజరానా ప్రకటించింది.

Aug 29, 2021, 4:23 pm IST

హైజంప్: పారాలింపిక్స్ తొలి ప్రయత్నంలో నిషద్ 1.89 మీటర్ల ఎత్తు దూకగా.. రాంపాల్ 1.84 మీటర్ల ఎత్తు దూకాడు.

Aug 29, 2021, 4:21 pm IST

హై జంప్: రాంపాల్ చాహర్ వ్యక్తిగత బెస్ట్ 1.94 మీటర్లు. సీజన్ బెస్ట్ 1.90 మీటర్లు.

Aug 29, 2021, 4:20 pm IST

డిస్కస్ త్రో: పారాలింపిక్స్ బరిలో నిలిచిన భారత డిస్కస్ త్రోయర్ నిషద్ కుమార్ సీజన్ బెస్ట్ 18.52 మీటర్లు. వ్యక్తిగత బెస్ట్ 19.29 మీటర్లు.

Aug 29, 2021, 3:10 pm IST

అథ్లెటిక్స్:

పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో భారత పారా అథ్లెట్ నిషద్ కుమార్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. షెడ్యూల్ ప్రకారం మరికొద్దిసేపట్లో 3.54 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది. 3.58 గంటలకు హై జంప్ ఫైనల్ ఈ వెంట్ కూడా జరగనుంది.

Aug 29, 2021, 3:07 pm IST

ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కంపౌండ్ క్వార్టర్ ఫైనల్లో భారత పారా అథ్లెట్లు రాకేశ్ కుమార్, జ్యోతి బలియన్ జోడీ పోరాటం ముగిసింది .. టర్కీకి చెందిన ఒజ్నర్ కుర్, బులెంట్ కొర్కమజ్‌ చేతిలో 151-153 తేడాతో ఓటమిపాలైంది.

Aug 29, 2021, 1:20 pm IST

ఆర్చరీ: మిక్స్‌డ్ టీమ్ కంపౌండ్ క్వార్టర్ ఫైనల్లో భారత పారా అథ్లెట్లు రాకేశ్ కుమార్, జ్యోతి బలియన్ జోడీ.. టర్కీకి చెందిన ఒజ్నర్ కుర్, బులెంట్ కొర్కమజ్‌తో తలపడనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2.40 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభంకానుంది. భారత జోడీ ముందంజ వేస్తే.. సెమీఫైనల్ కూడా ఈ రోజే జరగనుంది.

Aug 29, 2021, 12:18 pm IST

భవీనా పటేల్ సిల్వర్ మెడల్ అందుకుంటున్న వీడియో

Aug 29, 2021, 8:53 am IST

టోక్యో పారాలింపిక్స్

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని అందుకున్న భవిన పటేల్‌లను అభినందించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

Aug 29, 2021, 8:43 am IST

టోక్యో పారాలింపిక్స్

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని అందుకున్న భవిన పటేల్‌లను అభినందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కోట్లాదిమందికి స్ఫూర్తినిచ్చారంటూ ప్రశంసించిన ప్రధాని మోడీ.

Aug 29, 2021, 8:37 am IST

టోక్యో పారాలింపిక్స్

మహిళల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భవిన పటేల్ రజత పతకాన్ని అందుకోవడంతో.. ఆమె స్వస్థలం గుజరాత్‌లోని మెహ్‌సానాలో పండుగ వాతావరణం నెలకొంది. ఆమె కుటుంబ సభ్యులు స్వీట్లు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

Aug 29, 2021, 7:55 am IST

టోక్యో పారాలింపిక్స్

టేబుల్ టెన్నిస్ మహిళల విభాగానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న భవిన పటేల్ ఫైనల్స్‌లో ఓటమి చవి చూశారు. చైనాకు చెందిన యింగ్ ఝౌ చేతిలో ఆమె చివరి వరకూ పోరాడినప్పటికీ.. విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ కేటగిరీలో ఫైనల్స్‌కు చేరినందున రజత పతకాన్ని భవిన అందుకుంటారు.

Aug 29, 2021, 7:46 am IST

టోక్యో పారాలింపిక్స్

రెండో సెట్‌ను కూడా కోల్పోయిన భవిన పటేల్. 11-5 స్కోర్ తేడాతో ఆధిక్యాన్ని కనపరిచిన చైనా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ యింగ్ ఝౌ

Aug 29, 2021, 7:42 am IST

టోక్యో పారాలింపిక్స్

టేబుల్ టెన్నిస్ మహిళల విభాగం ఫైనల్స్‌లో తొలి సెట్‌ను కోల్పోయిన భవిన పటేల్. చైనాకు చెందిన యింగ్ ఝౌపై 7-11 స్కోర్ తేడాతో తొలి సెట్‌లో ఓటమి. రెండో సెట్ కొనసాగుతోంది.

Aug 29, 2021, 7:31 am IST

టోక్యో పారాలింపిక్స్ 2021

మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ 1/16 ఎలిమినేషన్ విభాగంలో భారత పారా అర్చర్ జ్యోతి బాలన్ ఓటమి. ఐర్లాండ్ లూయిస్ కే లియోనార్డ్ చేతిలో 137-141 తేడాతో పరాజయం.

Aug 29, 2021, 6:38 am IST

టోక్యో పారాలింపిక్స్

టేబుల్ టెన్నిస్ మహిళల విభాగానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న భవిన పటేల్ ఇంకాస్సేపట్లో ఫైనల్స్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ కేటగిరిలో ఇప్పటికే భారత్‌కు పతకం ఖాయమైంది. చైనాకు చెందిన యింగ్ ఝౌను ఆమె ఎదుర్కొనబోతోన్నారు.

Aug 28, 2021, 4:29 pm IST

ఈ రోజుతో పారాలింపిక్స్‌లో భారత్ పాల్గొనే ఈవెంట్స్ ముగిశాయి. తిరిగి ఆదివారం ఉదయం భవీన్ పటేల్ టేబుల్ టెన్నిస్ మ్యాచ్ ఫైనల్స్ జరుగుతుంది

Aug 28, 2021, 4:27 pm IST

రంజీత్ భాటీ వేసిన ఏ త్రో క్వాలిఫై కాలేదు. దీంతో పారాలింపిక్స్‌లో ఆయన జర్నీ ముగిసింది

Aug 28, 2021, 4:12 pm IST

జావెలిన్ త్రోలో భారత్‌కు నిరాశ. వరుసగా ఆరు ఫౌల్ త్రో వేసిన రంజీత్ భాటీ

Aug 28, 2021, 3:24 pm IST

జావెలిన్ త్రో ఫైనల్స్ కాసేపట్లో ప్రారంభం అవుతాయి. భారత్ నుంచి రంజీత్ భాటీ పోటీలో ఉన్నాడు

Aug 28, 2021, 11:35 am IST

ఆదివారం ఉదయం 7 గంటల 15 నిమిషాలకు జరిగే ఫైనల్స్‌లో భవీనా చైనాకు చెందిన యింగ్ జౌతో తలపడుతుంది

Aug 28, 2021, 11:34 am IST

చైనాకు చెందిన వరల్డ్ నెంబర్ 3 జాంగ్ మియావ్‌ పై విజయం సాధించి ఫైనల్స్‌లో అడుగుపెట్టింది భవీనా పటేల్

Aug 28, 2021, 11:32 am IST

టేబుల్ టెన్నిస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన భవీనా పటేల్

Aug 28, 2021, 11:31 am IST

పారాలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌లో చరిత్ర సృష్టించిన భారత్

Story first published: Friday, September 3, 2021, 9:16 [IST]
Other articles published on Sep 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X