న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెప్పకుండా వెళ్లారు.. పాకిస్థాన్ చేతిలో ఓడారు.!!

Pakistan beat ‘unauthorised’ Indian team to win circle-style Kabaddi World Cup

లాహోర్: అన‌ధికార క‌బ‌డ్డీ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్ విజేతగా నిలిచింది. లాహోర్‌లోని పంజాబ్ స్టేడియం వేదికగా ఆదివారం జ‌రిగిన ఫైన‌ల్లో.. పాకిస్థాన్ 43-41తో అనధికారిక భారత జట్టుపై విజయం సాధించింది. ఆద్యాంతం హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫ‌స్ట్ హాఫ్‌లో అనధికారిక భారత్ ఆధిపత్యం కనబర్చింది. ఆఖరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు విజయం ఆతిథ్య జట్టునే వరించింది. కీలక సమయంలో జోరు ప్రదర్శించిన పాక్ ఆటగాళ్లు విజయంతో పాటు ప్రపంచకబడ్డీ టైటిల్‌ను అందుకున్నారు. పాక్ విజయంలో బిన్‌యామీన్‌, ఇర్ఫాన్ మానా, షఫిక్ చిస్తీలు కీల‌క పాత్ర పోషించారు.

తొలిసారి పాక్‌లో..

తొలిసారి పాక్‌లో..

ఇక క‌బ‌డ్డీ వ‌ర‌ల్డ్‌క‌ప్ పాకిస్థాన్‌లో జరగడం ఇదే తొలిసారి. గ‌తంలో ఆరుసార్లు ఈ టోర్న‌మెంట్‌కు భారతే ఆతిథ్యం ఇచ్చింది. మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ టోర్నీలో.. లాహోర్‌, ఫైస‌లాబాద్‌, క‌ర్తార్‌పూర్‌, నాన్‌క‌న్ సాహిబ్ న‌గ‌రాల్లో మ్యాచ్‌లను నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో అనధికారిక భారత జట్టుతో పాటు ఇరాన్, కెన‌డా, ఆస్ట్రేలియా, అమెరికా, సియ‌రాలియోన్‌, కెన్యా కూడా పాల్గొన్నాయి. టోర్నీ గెలిచిన పాక్ ప్లేయ‌ర్ల‌కు రూ. 10 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీ ఇవ్వగా... ర‌న్న‌ర‌ప్‌కు ఏడున్న‌ర ల‌క్ష‌లు అందజేశారు.

ఇమ్రాన్ అభినందనలు..

కబడ్డీ ప్రపంచకప్ అందుకున్న పాక్ ఆటగాళ్లను ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. ఫైనల్లో భారత్‌ను ఓడించి కబడ్డీ ప్రపంచకప్ గెలిచిన పాకిస్థాన్ కబడ్డీ జట్టుకు అభినందనలని ట్వీట్ చేశాడు.

అనధికారిక భారత్ ఎందుకంటే?

అనధికారిక భారత్ ఎందుకంటే?

వాస్త‌వానికి పాక్‌కు వెళ్లింది అస‌లైన భారత జట్టు కాదు. ఈ టోర్నీలో పాల్గొన్న భారత కబడ్డీ జట్టుకు భారత కబడ్డీ సమాఖ్య అనుమతిలేదు. క్రీడా, విదేశీ, హోం శాఖలు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు దేశ జెర్సీలతో బరిలోకి దిగలేదు. అయితే ఈ టోర్నీలో ఎవరి అనుమతి లేకుండా పాల్గొనడంపై తీవ్ర దుమారం రేగింది. ఈ టోర్నీలో పాల్గొనడానికి ఏ ఒక్కరికి కూడా అనుమతివ్వలేదని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పష్టం చేశారు.అమెచ్యూర్ క‌బ‌డ్డీ ఫెడ‌రేష‌న్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా తామెవరికీ అనుమతి ఇవ్వలేదని, ఎలాంటి జట్టను పంపిచలేదని స్పష్టం చేశాయి. ఐఓఏ ప్రెసిడెంట్ నరిందర్ బత్రా అయితే అనుమతి లేకుండా వెళ్లిన జట్టు భారత జెండా, పేరు ఉపయోగించుకోవడాని వీల్లేదని స్పష్టం చేశారు.

టోర్నీ కూడా అనధికారమే..

టోర్నీ కూడా అనధికారమే..

ఆసియా దేశాలు నిర్వహించే కబడ్డీ టోర్నమెంట్‌ను అధికారికంగా గుర్తించమని గతంలో ప్ర‌పంచ క‌బడ్డీ స‌మాఖ్య ప్రకటించిన నేపథ్యంలో ఈ టోర్నీకి కూడా అధికారిక గుర్తింపు లభించలేదు.

Story first published: Monday, February 17, 2020, 14:32 [IST]
Other articles published on Feb 17, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X