న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అభిమాని చేసిన ఓ సూచన స్విమ్మర్‌కు పునర్జన్మను ప్రసాదించింది

By Nageshwara Rao

మెల్‌బోర్న్: రియో ఒలింపిక్స్‌లో 400 మీటర్ల ఫ్రీ స్టయిల్ స్విమ్మింగ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన మ్యాక్ హోర్టన్‌ని అమితంగా అభిమానించే ఓ అభిమాని అతడికి పునర్జన్మను ప్రసాదించాడు. వివరాల్లోకి వెళితే... హోర్టన్‌‌కు ఓ అభిమాని ఉన్నాడు.

హోర్టన్ ప్రతి కదలికను అతడు జాగ్రత్తగా గమనిస్తుంటాడు. హోర్టన్ ఛాతిపై ఉన్న ఓ మచ్చను తీక్షణంగా పరిశీలిస్తూ వచ్చిన ఆ అభిమాని ఆస్ట్రేలియా స్విమ్మింగ్ కోచ్‌కు ప్రత్యేకంగా ఓ ఈ-మెయిల్ రాశాడు. అందులో అతడు హోర్టన్‌ ఛాతిపై అంచెలంచెలుగా పెరుగుతున్న మచ్చ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు.

Olympic swimmer Mack Horton gets potentially life-saving warning from an fan

గతంలో ఉన్న దానికంటే ఈ మధ్య కాలంలో హోర్టన్ ఛాతిపై ఆ మచ్చ పరిమాణం, రంగులో మార్పు వచ్చిందంటూ చెప్పడంతో హోర్టన్ దానిపై దృష్టి సారించాడు. ఇంకేముంది కోచ్ సలహా మేరకు వెంటనే చికిత్స కోసం డాక్టర్లను సంప్రదించాడు.

అయితే ఆ మచ్చ ప్రమాదకర చర్మ క్యాన్సర్ తాలూకా అని తేలింది. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా వ్యాధికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం ఛాతిపై ఆపరేషన్ జరిగిందని ఆ అభిమానికి తెలిసేలా మ్యాక్ ఫొటోలను శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

అంతేకాదు ఆ అభిమానికి ధన్యవాదాలు తెలుపుతూ సందేశాన్ని కూడా పోస్టు చేశాడు. చాతీపై ఉన్న మచ్చపై ప్రత్యేక శ్రద్ధ వహించమని మా స్విమ్మింగ్ టీమ్ కోచ్‌కు అభిమాని మెయిల్ పంపాడు. అది ప్రమాదకర చర్మ క్యాన్సర్ వ్యాధిని గుర్తించిన ఆ అభిమాని చేసిన సూచన వెలకట్టలేనిది అంటూ రాశాడు.

ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అత్యధిక చర్మ క్యాన్సర్ బారిన పడుతున్న దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. దేశ జనాభాలో దాదాపు 66 శాతం మంది ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నట్లు తేలింది. ప్రతి ఏడాది రెండు వేల మందికి పైగా చర్మ క్యాన్సర్‌తో చనిపోతున్నట్లు వైద్య నివేదికల్లో వెల్లడైంది.

సూర్యని కిరణాల్లో ఉండే ప్రమాదకర అతినీలలోహిత (యువీ రేడియేషన్) ప్రభావంతోనే అత్యధిక మంది చర్మ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతుంటారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X