న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Brianna McNeal: ఒలింపిక్ విజేతపై ఐదేళ్ల నిషేధం

Olympic 100m Hurdles Champ Brianna McNeal Banned For Five Years

న్యూయార్క్: అమెరికాకు చెందిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఒలింపిక్‌ చాంపియన్‌ బ్రియాన్నా మెక్‌నీల్‌పై ఐదేళ్ల నిషేధం పడింది. ఆమె మరోసారి డోపింగ్ టెస్ట్ నియమాలను ఉల్లంఘించడంతో అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) ఈ చర్య తీసుకుంది. ఫలితాల నిర్వహణ ప్రక్రియలో దెబ్బతిన్నందుకు గానూ ఆమెపై నిషేధం విధించినట్లు ఏయూఐ తెలిపింది.
దాంతో రాబోయే టోక్యో ఒలింపిక్‌ క్రీడల్లో ఆమె పాల్గొనడంపై నీలి నీడలు కమ్ముకొన్నాయి. అయితే, ఏఐయూ నిర్ణయాన్ని ఆమె కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్‌(సీఏఎస్‌)లో అప్పీల్‌ చేసింది. దీన్ని సీఏఎస్‌ జులై 23న విచారించనుంది.

అయితే, ఒలింపిక్‌ ట్రయల్స్‌ కోసం జూన్‌ 27న అమెరికా నిర్వహించే పోటీల్లో మాత్రం పాల్గొనేందుకు సీఏఎస్‌ అనుమతించింది. అప్పటి వరకు ఏఐయూ విధించిన నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మెక్‌నీల్‌ బంగారు పతకం సాధించింది. అంతకుముందు 2013లో వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. 2017లో మూడు యాంటీ డోపింగ్‌ టెస్టులు తప్పించుకున్నందుకుగానూ ఆమెపై ఏఐయూ ఏడాదిపాటు నిషేధం విధించింది. దీంతో 2017లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె పాల్గొనలేకపోయింది.

Story first published: Friday, June 4, 2021, 22:21 [IST]
Other articles published on Jun 4, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X