న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కామన్వెల్త్ గేమ్స్: రోనక్ పేరు తొలగింపు, షూటింగ్ జట్టులో అయోమయం!

By Nageshwara Rao
NRAI chief takes digs at ministry, backs Ronak Pandit and Heena Sidhu

హైదరాబాద్: ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ వేదికగా జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల సహాయ సిబ్బంది, కుటుంబ సభ్యుల జాబితాపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోత విధించింది. భారత ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఓఏ) సిఫార్సు చేసిన జాబితా నుంచి 21 మందికి అనుమతి నిరాకరించింది.

ఈ జాబితాలో బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు తల్లి విజయ, సైనా నెహ్వాల్‌ తండ్రి హర్‌వీర్‌సింగ్‌ కూడా ఉన్నారు. అయితే, మాజీ షూటర్‌ రోనక్‌ పండిట్‌ పేరును కూడా ఈ జాబితా నుంచి తొలగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొంటున్న షూటర్‌ హీనా సిద్ధు భర్త రోనక్ పండిట్. అంతేకాదు గత కొన్నేళ్లుగా ఆమెకు కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం రోనక్ పండిట్ భారత పిస్టల్‌, రైఫిల్‌ జట్టు హై పర్ఫార్మెన్స్‌ డైరెక్టర్‌‌గా కూడా వ్యవహారిస్తున్నాడు.

ఈ క్రమంలో హీనా సిద్ధు భర్త అనే ఒకే ఒక్క కారణంతో రోనక్‌ను తప్పించడంపై ఆశ్చర్యంగా ఉంది. అంతేకాదు కామన్వెల్త్‌ క్రీడల నిర్వాహకులు రోనక్‌ పేరిటే క్రీడాకారులకు గన్‌ పర్మిట్‌లు ఇవ్వగా, ఇప్పుడు జాబితా నుంచి క్రీడా శాఖ అతని పేరును తొలగించడం భారత షూటింగ్‌ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ విషయంలో క్రీడా శాఖ తీరుపై భారత జాతీయ రైఫిల్‌ సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) అధ్యక్షుడు రణిందర్‌సింగ్‌ తప్పుపట్టాడు. గన్‌లు లేకుంటే షూటర్లు పోటీల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించాడు. కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనే జాతీయ షూటింగ్‌ జట్లకు విమానాశ్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్‌లు తెచ్చి.. తిరిగి తీసుకెళ్ళడానికి నిర్వాహక దేశం గన్‌ పర్మిట్‌లు ఇస్తుంది.

భారత షూటింగ్ జట్టు కోసం రోనక్ పండిట్ పేరిట గన్ పర్మిట్‌లను ఇచ్చారు. అయితే ఇప్పుడు జాబితా నుంచి అతడి పేరుని తొలగించడం భారత షూటింగ్ జట్టుని అమోయమంలో పడేసింది. అయితే రోనక్ పండిట్ విషయంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. హీనాకు కోచ్‌గా 2016 రియో ఒలింపిక్స్‌కు వెళ్ళేందుకు సైతం రోనక్‌ను అనుమతించలేదు.

ఈ విషయంపై హీనా మాట్లాడుతూ 'నేనెప్పుడూ అబద్ధం ఆడలేదు. మోసం చేయలేదు. 11 ఏళ్ళుగా షూటింగ్‌ క్రీడలో ఉన్నా. ఆరేళ్ళుగా రోనక్‌తో కలిసి సాధన చేస్తున్నా. ఆరేళ్ళుగా ఇదే గొడవ. కోచ్‌కు నిధులు విడుదల, ప్రయాణాలు, గుర్తింపు విషయాల్లో పోరాడి అలసిపోయా. రోనక్‌ నా కోచ్‌. నాకు ఒకడే కోచ్‌. షూటింగ్‌ రేంజ్‌లో 5 నిమిషాలు ఉంటే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుంది' అని పేర్కొంది.

Story first published: Saturday, March 24, 2018, 10:27 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X