న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2032 ఒలింపిక్స్‌: ఉమ్మడిగా బిడ్డింగ్ దాఖలు చేయనున్న కొరియన్లు

North and South Korea Want to Host the 2032 Olympics Together

హైదరాబాద్: 2032 ఒలింపిక్స్‌‌ను దక్షిణ కొరియా, ఉత్తర కొరియా ఉమ్మడిగా నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అంటున్నాయి. ఈ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా 2032 ఒలింపిక్స్‌ బిడ్‌ను వేయనున్నాయి. స్విట్జర్లాండ్‌లోని లుసానెలో ఈ శుక్రవారం బిడ్డింగ్‌ కార్యక్రమంలో తమ రెండు దేశాలు కలిసి పాల్గొంటున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి వెల్లడించాయి.

<strong>భండారీపై దాడి: ఢిల్లీ క్రికెటర్‌ అనూజ్‌పై జీవితకాల నిషేధం!</strong>భండారీపై దాడి: ఢిల్లీ క్రికెటర్‌ అనూజ్‌పై జీవితకాల నిషేధం!

రాజధాని సియోల్‌ను దక్షిణ కొరియా ఒలింపిక్స్‌ వేదికగా ఎంచుకోగా.. ఉత్తర కొరియా ప్యాంగ్‌యాంగ్‌ను ఎంచుకునే యోచనలో ఉన్నాయి. 2032 ఒలింపిక్స్‌లో ఇరు దేశాలు కలిసే పోటీ చేసే యోచనలో ఉన్నాయి. రియో వేదికగా 2016లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఈ రెండు దేశాలు కలిసి ఆడాయి.

కాగా, గతేడాది దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌యాంగ్‌లో జరిగిన వింటర్ ఒలింపిక్స్‌కు ఉత్తర కొరియా తమ జట్లను పంపడంతో రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడ్డాయి. అంతేకాదు వింటర్ ఒలింపిక్స్‌లో ఇరు దేశాలు ఒకే జెండా కింద మార్చి ఫాస్ట్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే.

గతంలో దక్షిణ కొరియా 1988లో సియోల్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించింది. అయితే, అప్పట్లో ఉత్తర కొరియా వాటిని బహిష్కరించింది. మరోవైపు తమ ద్వీపకల్పంలో ఉద్రిక్తతల నివారణ, శాంతి స్థాపనకు దోహదపడుతుందని భావించి సంయుక్త బిడ్డింగ్‌కు దక్షిణ కొరియా చొరవ చూపింది. గతేడాది రెండు దేశాల అంతర్గత చర్చల్లో దీనిపై ప్రస్తావించగా ఇందుకు ఉత్తర కొరియా అంగీకరించింది.

Story first published: Wednesday, February 13, 2019, 12:33 [IST]
Other articles published on Feb 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X