ఇలా కూడా ప్రాక్టీస్ చేస్తారా..? కొబ్బరి బొండాలతో షాట్‌పుట్

Posted By:
No shot put or discus? Use a coconut instead

హైదరాబాద్: షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో బలంగా విసిరే క్రీడలు. అయితే ఈ రెండు విభాగాల్లో బరిలోకి దిగనున్న కుక్‌ ఐలాండ్‌కు చెందిన అథ్లెట్‌ టెరియాపి టపోకి మాత్రం తాను విభిన్నంగా కొబ్బరి బొండాలతో ప్రాక్టీస్‌ చేశానని చెప్పింది. కుక్‌ ఐలాండ్స్‌కు చెందిన ఈమె మాత్రం సదుపాయాలు, సరైన క్రీడాసామాగ్రి లేకపోయినా కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీ పడేందుకు సై అంటోంది.

కుక్‌ ఐలాండ్స్‌ 15 దీవుల సముదాయం కాగా ఇందులో రరోతొంగకు చెందిన పోలీసు ఆఫీసర్‌ టెరీపి టపొకి ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌. షాట్‌పుట్, డిస్కస్‌త్రోలో పోటీపడుతుంది. వారి దీవుల్లో డిస్క్, షాట్‌పుట్‌కు వినియోగించే ఇనుప గుండ్లు లేవట. దీంతో ఆమె కొబ్బరి బోండాలనే విసురుతూ ప్రాక్టీస్‌ చేసింది.

పోలీస్‌ అధికారిగా పనిచేస్తున్న 33 ఏళ్ల టపోకి.. 2004 ఏథెన్స్‌ ఒలింపిక్స్‌, 2008 బీజింగ్‌ క్రీడల్లోనూ పాల్గొంది. కామన్వెల్త్‌ క్రీడల్లో డిస్కస్‌ త్రో, షాట్‌పుట్‌ విభాగాల్లోనూ బరిలోకి దిగిన టపోకి.. 2006 మెల్‌బోర్న్‌ క్రీడల్లో 11వ స్థానంలో నిలిచింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఆమె గర్భం కారణంగా 2010 ఢిల్లీ, 2014 గ్లాస్గో గేమ్స్‌కు దూరమైంది.

'మేము షార్ట్‌పుట్‌ ప్రాక్టీస్‌ చేసేందుకు గుండులు అందుబాటులో లేవు. అందుకే కొబ్బరి కాయలతో సాధన చేస్తున్నాను. అలాగే డిస్కస్‌ కూడా. కొంచెం కష్టంగానే ఉంది' అని టపోకి వివరించింది.

Story first published: Thursday, April 5, 2018, 10:01 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి