న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియన్ గేమ్స్‌లో పతాకధారిగా నీరజ్ చోప్రా

So proud of @Neeraj_chopra1 for being selected as the flag bearer at the Asian Games and would like to thank the powers to be for selecting Neeraj! Neeraj - you have a long way to go but this is an incredible achievement - wish you all the best my friend! Keep flying the flag!— Parth Jindal (@ParthJindal11) August 10, 2018

హైదరాబాద్: గత టోర్నీల ఫలితం ఆధారంగా తర్వాతి ఈవెంట్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించే వారిలో ముఖ్యువెవరో నిర్ణయిస్తారు. వారిలో మెరుగైన ఫలితాలు రాబట్టిన వారిని పతాకధారుడిగా ఎన్నుకొని జట్టు ముందు నడిపిస్తారు. ఇంతటి అరుదైన గౌరవం భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు దక్కింది. ఆసియా గేమ్స్‌లో భారత పతాకధారిగా(ఫ్లాగ్‌బేరర్) నీరజ్ వ్యవహరించనున్నాడు. త్వరలో ఇండోనేషియాలో జరగనున్న ఆసియా క్రీడలు-2018 ఆరంభ వేడుకల్లో నీరజ్ మువ్వన్నెల జెండాతో భారత బృందం ముందు నడవనున్నాడు.

'పతకం గురించి కాదు.. అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకే కష్టపడతా''పతకం గురించి కాదు.. అత్యుత్తమ ప్రదర్శనే ఇచ్చేందుకే కష్టపడతా'

ప్రతిష్టాత్మక క్రీడల్లో నీరజ్ భారత బృందానికి నాయకత్వం వహిస్తాడని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) అధ్యక్షుడు నరేందర్ బాత్రా శుక్రవారం వెల్లడించారు. 20ఏళ్ల‌ నీరజ్ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క్రీడ‌ల్లో ఏ ఒక్క భార‌త జావెలిన్ త్రోయ‌ర్ కూడా బంగారు ప‌త‌కం కొల్ల‌గొట్ట‌లేదు. చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయాల‌ని చోప్రా ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. వచ్చే ఆసియా గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసి స్వర్ణపతకంతో మెరుస్తాడని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

క్రీడా జ్యోతిని ఐదు సార్లు బాక్సింగ్ ఛాంపియన్ అయిన భారత బాక్సర్ మేరీకోమ్ చేతుల మీదుగా ఇండోనిషియా బ్యాడ్మింటన్ లెజెండ్, బార్సిలోనా ఒలింపిక్ స్వర్ణ విజేత సుశీ సుశాంతి అందుకున్నారు. వీరితో పాటుగా మానికా బాత్ర, కమల్, ఏస్ షూటర్ జీతూ మరికొందు క్రీడా జ్యోతిని తమ చేతులమీదుగా కాసేపు కవాతుతో నడిచారు. వారిలో ఒకరైన టాప్ అథ్లెట్ ఒకరు మాట్లాడుతూ.. ఇదంతా గందరగోళంగా అనిపించింది. అయినా ఏదో జరిగిపోయింది కదా అంటూ వ్యాఖ్యానించారు.

ఈ 2018 ఆసియన్ గేమ్స్ క్రీడాజ్యోతి 18వేల కి.మీలు ప్రయాణించి చివరగా ఇండోనేషియా చేరనుంది. ఈ క్రమంలో 1951వ సంవత్సరంలో జరిగిన ఆసియన్ గేమ్స్ ఇదే నేషనల్ స్టేడియం వేదికగా మొదలైయ్యాయి. దాంతో భారత్‌లోని ఈ స్టేడియం వేదికగానే క్రీడాజ్యోతి ప్రతి సీజన్‌కు బయల్దేరుతుంది. ఇలా ఆసియన్ గేమ్స్‌లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడికి భారత్ ఓ ప్రత్యేక ప్రదేశంగా అనిపిస్తుంది. ప్రస్తుత సంవత్సరంలో ఆగష్టు 18 నుంచి జరగనున్న ఈ వేడుకలను ఇండోనేషియా ఆసియన్ గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ (ఐఎన్ఏఎస్‌జీఓసీ) నిర్వహించనుంది.

Story first published: Friday, August 10, 2018, 16:26 [IST]
Other articles published on Aug 10, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X