న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్: స్వర్ణం నెగ్గిన అన్నురాణి, తప్పుకున్న నీరజ్ చోప్రా!

National Open Athletics Championship: Annu Rani wins gold, Neeraj Chopra pulls out

హైదరాబాద్: రాంచీ వేదికగా జరుగుతున్న 59వ జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జావెలిన్‌ త్రోయర్‌ అన్ను రాణి స్వర్ణం పతకం సాధించింది. గురువారం బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగిన మహిళల జావెలిన్‌ త్రో విభాగంలో అన్ను రాణి 58.60 మీటర్ల దూరం విసిరి స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది.

ఇటీవలే దోహా వేదికగా ముగిసిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 62.43 మీటర్ల దూరం విసిరి అన్నురాణి సరికొత్త రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే. అన్నురాణి విసిరిన ఆరు త్రోలు కూడా తన ప్రత్యర్ధి రైల్వే జట్టు సహచర క్రీడాకారిణి షర్మిలా కుమారి కంటే అత్యుత్తమంగా నిలిచింది.

రాజీనామా తర్వాత పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై తొలిసారి కపిల్ స్పందనరాజీనామా తర్వాత పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశంపై తొలిసారి కపిల్ స్పందన

25 ఏళ్ల అన్నురాణి తొలి త్రోలో 56.97 మీటర్లు విసరగా... ఆ తర్వాతి త్రోలను 55.97, 58.31, 57.29, 56.86 దూరం విసిరింది. చివరకు 58.60త్రోతో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో స్థానంలో నిలిచిన షర్మిలా కుమారి అత్యుత్తమ త్రో 53.28 మీటర్లుగా ఉంది.

అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, ఒలింపిక్స్‌లో జపాన్‌కు: ఒసాకా సంచలన నిర్ణయంఅమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, ఒలింపిక్స్‌లో జపాన్‌కు: ఒసాకా సంచలన నిర్ణయం

మరోవైపు కోచ్‌ సూచన మేరకు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ ఛాంపియన్‌షిప్‌ నుంచి తప్పుకున్నాడు. ఇక, మహిళల 100 మీటర్ల సెమీఫైనల్‌ క్వాలిఫయర్స్‌లో స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ 11.55 సెకన్ల టైమింగ్‌తో ఆకట్టుకుంది. అర్చనా సుసేంద్రన్‌(11.87సె), ప్రియాంక కలగీ, ఎమ్‌వీ జిల్నా రాణించారు.

Story first published: Friday, October 11, 2019, 11:13 [IST]
Other articles published on Oct 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X