న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజర్: హెల్మెట్‌ను దాటుకొని కంటిని తాకిన బౌన్సర్

By Nageswara Rao

వెల్లింగ్టన్: వెల్లింగ్టన్‌లో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాడు మిచేల్‌ మెక్‌క్లాన్‌గన్‌ పాకిస్థానీ బౌలర్ బౌన్సర్‌ ధాటికి మైదానంలో కుప్పకూలాడు. పాకిస్థానీ ఫాస్ట్ బౌలర్ అన్వర్ అలీ మెరుపువేగంతో వేసిన బౌన్సర్‌ మిచేల్‌ ధరించిన హెల్మెట్‌ను సైతం దాటుకొని అతని ఎడమ కన్నును బలంగా తాకింది.

దీంతో అతడు బాధతో విలవిలలాడుతూ మైదానంలో కిందపడిపోయాడు. టెయిల్‌ ఎండర్‌గా బరిలోకి దిగిన మిచేల్‌ మైదానంలోకి అడుగుపెట్టిన కొద్దిసేపటికే బౌన్సర్‌ అతడిని తాకింది. దీంతో అతడి కన్ను చుట్టూ రక్తస్రావం కావడంతో వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Nasty blow on left eye for Mitchell McClenaghan as ball smashes through grille

అక్కడే అతనికి కొన్ని కుట్లు వేసిన ఆసుపత్రి సిబ్బంది కంటి చుట్టు ఉన్న ఎముకలు కొన్ని విరిగాయని, తాను బాగున్నానని మిచేల్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే కన్ను చుట్టు ఉన్నఎముక స్వల్పంగా విరుగడం వల్ల మిచెల్‌కు చిన్నపాటి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరముందని వైద్యులు తెలిపారు.


ల్లింగ్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్ హర్ట్‌గా మిచెల్ వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 210 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్ గెలుపొందింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే మ్యాచ్ గురువారం నైపీలో జరగనుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X