న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

14 ఏళ్లకే కవలకు తల్లి, అంతర్జాతీయ రెజ్లర్‌గా గుర్తింపు: ఎవరీ నీతు

Mother of 2 at the age of 14, Neetu Sarkar is now an international wrestler

హైదరాబాద్: 14 ఏళ్ల వయసులో కవలల తల్లెంది. కుటుంబాన్ని పోషించడం కోసం రోజు వారీ కూలీగా కూడా పనిచేసింది. చిన్న వయసులోనే పెళ్లై.. పిల్లలు ఉన్నా ఆమె రెజ్లింగ్‌లో ఛాంపియన్‌‌గా నిలిచింది. తాజాగా హర్యానాలో జరిగిన అండర్‌-23 రెజ్లింగ్‌ పోటీల్లో స్వర్ణం సాధించి, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన నీతు సర్కార్‌ స్టోరీ ఇది.

హర్యానాలోని మారుమూల గ్రామం బేద్వాకు చెందిన నీతుకు చిన్నప్పటి నుంచి కుస్తీ అంటే చాలా ఇష్టం. అందుకు కారణం... తన చుట్టుపక్కల అంతా కుస్తీ వాతావరణం ఉండటమే. దీంతో ఆమె కూడా కుస్తీని నేర్చుకోవాలని భావించింది. అయితే, ఆమెకు ఇంట్లో ఆంక్షలు విధించారు. మరోవైపు కుటుంబంలో ఆర్థిక కష్టాలు..

మూడో రోజే భర్త నుంచి విడిపోయిన నీతు

మూడో రోజే భర్త నుంచి విడిపోయిన నీతు

దీంతో 13 ఏళ్లకే నీతును 40 ఏళ్ల వయసున్న మానసిక వికలాంగుడికి ఇచ్చి పెళ్లి చేసింది. ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె మూడో రోజే భర్త నుంచి విడిపోయింది. దీంతో నీతుకు కుటుంబం నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అయితే, వీటిని నీతు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమయంలో ఆమెకు సంజయ్‌ అనే వ్యక్తి అండగా నిలిచాడు. అతడిని వివాహాం చేసుకుంది. దీంతో నీతు ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. కుటుంబ పోషణ కోసం రోజు వారి కూలీగా పని చేసింది. కానీ, తనకు ఎంతో ఇష్టమైన కుస్తీ పోటీలను మాత్రం వదిలిపెట్టలేకపోయింది.

2011లో కుస్తీ నేర్చుకోవడం

2011లో కుస్తీ నేర్చుకోవడం

ఈ సమయంలో తన భర్త నుంచి ప్రోత్సాహం లభించడంతో 2011లో కుస్తీ నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరు కవలకు తల్లి... కుస్తీల్లో ఇదేం గెలుస్తుందన్న వాళ్ల నోర్లు మూయించింది. అతి తక్కువ కాలంలో కుస్తీలో మెళకువలన్నీ నేర్చుకుంది. కుస్తీ కోసం తన ఇద్దరు పిల్లలను వదిలి 50 కిలోమీటర్ల దూరం వచ్చి ఒంటరిగా ఉంటూ శిక్షణను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో రెండేళ్ల పాటు పిల్లలకు దూరంగా గడిపింది. రోహ్‌తక్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని శిక్షణ శిబిరంలో కోచ్‌ మన్‌దీప్‌ పర్యవేక్షణలో రాటుదేలింది. కుస్తీలో ఆమె ఆరాధ్యదైవం సుశీల్‌కుమార్‌.

జాతీయ క్రీడల్లో రజతం గెలిచిన నీతు

జాతీయ క్రీడల్లో రజతం గెలిచిన నీతు

2015 కేరళలో జరిగిన జాతీయ క్రీడల్లో 57 కేజీల విభాగంలో రజతం గెలిచి నీతు సత్తా చాటింది. ఆ తర్వాత ఆమెకు మళ్లీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే రెజ్లింగ్‌లో నీతుకు ఉన్న నైపుణ్యాన్ని గుర్తించిన సహస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చి ప్రోత్సహించింది. కుస్తీలో మళ్లీ పుంజుకున్న నీతు తాజాగా హర్యానా వేదికగా జరిగిన అండర్‌-23 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. అదే సమయంలో బుకారెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కూడా ఎంపికైంది.

పతకాలు చూసి గర్వపడుతున్నారు

పతకాలు చూసి గర్వపడుతున్నారు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన సందర్భంగా నీతు మాట్లాడుతూ "రెజ్లింగ్‌లోకి వచ్చినందుకు నన్ను తిట్టిన గ్రామస్థులే ఇప్పుడు నేను సాధించిన పతకాలు చూసి గర్వపడుతున్నారు. నన్ను స్ఫూర్తిగా తీసుకోమని తమ కుమార్తెలకు చెబుతున్నారు. సుశీల్‌ 4 స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ వాళ్లే రోహ్‌తక్‌లో నాకు ఆశ్రయమిచ్చారు" అని తెలిపింది.

Story first published: Tuesday, October 2, 2018, 13:28 [IST]
Other articles published on Oct 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X