మిగతా అథ్లెట్లకు ఇది స్ఫూర్తి: స్వర్ణం సాధించిన చాను ప్రదర్శనపై మల్లీశ్వరి

Posted By:
Mirabai Chanu was going for gold from first lift: Karnam Malleswari

హైదరాబాద్: గోల్డ్ కోస్ట్ వేదికగా జరుగుతోన్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించిన మీరాభాయ్ చానుపై ఒలింపిక్‌ పతక విజేత కరణం మల్లీశ్వరి ప్రశంసలు కురిపించింది. మీరాభాయ్ చాను స్వర్ణ పతకం సాధించిన తర్వాత కరణం మల్లీశ్వరి మాట్లాడుతూ 'గోల్డ్‌కోస్ట్ గేమ్స్‌లో మనకు చక్కటి శుభారంభం దక్కింది' అని పేర్కొంది.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

మిగతా అథ్లెట్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది

మిగతా అథ్లెట్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది

'మిగతా అథ్లెట్లకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది. చాను లిఫ్టింగ్ అద్భుతంగా ఉంది. మొదటి లిఫ్ట్ నుంచే చాను గోల్డ్ మెడల్ లక్ష్యంగా ప్రయత్నాలు చేసింది. ఈ పర్ఫార్మెన్స్‌తో రానున్న ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు మరింత మెరుగైన ప్రదర్శన చేస్తారు' అని మల్లీశ్వరి ఏఎన్ఐ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మల్లీశ్వరి పేర్కొంది.

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చాను

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చాను

గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన మీరాభాయ్‌ చాను కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ తన సత్తా చాటింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా గురువారం జరిగిన పోటీల్లో వెయిట్ లిఫ్టర్ మీరాభాయ్ చాను భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

స్నాచ్, పుల్లింగ్ లిప్ట్‌ల్లో చాను కామెన్‌వెల్త్ రికార్డు

స్నాచ్, పుల్లింగ్ లిప్ట్‌ల్లో చాను కామెన్‌వెల్త్ రికార్డు

స్నాచ్, పుల్లింగ్ లిప్ట్‌ల్లో చాను కామెన్‌వెల్త్ రికార్డును సృష్టించింది. చాను తన మూడు ప్రయత్నాల్లో 80, 84, 86 కేజీల బరువును ఎత్తడం విశేషం. మహిళల 48 కేజీల విభాగంలో చాను మొత్తం 196 కేజీలు ఎత్తి స్వర్ణాన్ని గెలిచింది. 21వ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు వచ్చిన తొలి పతకం ఇదే కావడం విశేషం.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

భారత్‌కు తొలి స్వర్ణం అందించిన చానుకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ‘నిన్ను చూసి ఎంతో గర్వపడుతున్నాం, ఫస్ట్‌ గోల్డ్‌ లేడీ' అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇప్పటి వరకు భారత్‌ గెలుచుకున్న రెండు పతకాలు వెయిట్‌ లిఫ్టింగ్‌లోనే కావడం విశేషం. అంతకముందు పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, April 5, 2018, 16:48 [IST]
Other articles published on Apr 5, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి