న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హామిల్టన్‌కు షాక్.. ఎఫ్‌1 చాంప్ వెర్‌స్టాపెన్!

Max Verstappen wins first F1 world title after Mercedes protests rejected

అబుదాబి: రెడ్ బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ మ్యాజిక్ చేశాడు. ఎనిమిదో వరల్డ్ చాంపియన్‌షిప్‌తో ఎఫ్‌1 లెజెండ్ మైకేల్ షుమాకర్ రికార్డును బద్దలు కొట్టాలని ఆశించిన మెర్సిడెస్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు షాకిచ్చాడు. ఆదివారం జరిగిన చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నాటకీయ పరిణామాల మధ్య విజేతగా నిలిచాడు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌ అయ్యాడు. రేసు చివరి వరకు ఆధిక్యంలో ఉన్న మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ హామిల్టన్‌ ఆఖరి ల్యాప్‌లో వెనుకబడిపోయి ఓటమి మూటగట్టుకున్నాడు.

ప్రతిభకు కాస్త అదృష్టం కూడా తోడైతే... అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే... ఇక ఓటమి ఖాయమనుకున్న చోట కూడా పుంజుకొని అనూహ్య విజయం సాధించవచ్చని ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ నిరూపించాడు. బ్లాక్‌ బాస్టర్‌ సినిమాను తలపించిన 2021 ఎఫ్‌1 సీజన్‌ వివాదాస్పదంగా ముగిసింది.

డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ను తేల్చే అబుదాబి గ్రాండ్‌ప్రిలో 58 ల్యాప్‌ల ప్రధాన రేసును వెర్‌స్టాపెన్‌ (నెదర్లాండ్స్‌) అందరికంటే ముందుగా గంటా 30 నిమిషాల 17.345 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దాంతో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో 395.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన 24 ఏళ్ల వెర్‌స్టాపెన్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. 57వ ల్యాప్‌ వరకు ఆధిక్యంలో ఉండి చివరి ల్యాప్‌లో వెనుకబడిన హామిల్టన్‌ (బ్రిటన్‌) మొత్తం 387.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

2013 తర్వాత తొలిసారి రెడ్ బుల్‌కు వెర్‌స్టాపెన్ వరల్డ్ చాంపియన్‌షిప్ అందించాడు. దాంతో 2017 నుంచి వరుసగా నాలుగు సార్లు విన్నర్‌గా నిలిచిన హామిల్టన్ జోరుకు బ్రేక్ పడింది. వాప్తవానికి అబుదాబి గ్రాండ్ ప్రి ఫైనల్ రేసును వెర్‌స్టాపెన్ పోల్ పోజిషన్‌లో మొదలుపెట్టినప్పటికీ హామిల్టన్ చివరి వరకూ ఆధిపత్యం చూపెట్టాడు. కానీ చివరి ల్యాప్‌లో హామిల్టన్‌ను అనూహ్యంగా ఓవర్ టేక్ చేసిన వెర్‌స్టాపెన్ ఫస్ట్ ప్లేస్‌లో రేస్ పూర్తి చేసి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.

రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్‌ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్‌ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా వెర్‌స్టాపెన్‌ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించింది. ఈ విషయంపై స్టీవర్డ్స్‌కు మెర్సిడెస్‌ ఫిర్యాదు కూడా చేసింది. నిబంధనల ప్రకారం ల్యాప్డ్‌ కార్లు అన్‌ల్యాప్‌ అయితే తాము వెనుకబడి ఉన్న ల్యాప్‌ను పూర్తి చేసుకొని మళ్లీ మిగతా కార్ల వెనుక చేరే వరకు కూడా సేఫ్టీ కార్‌ పిట్‌లోకి వెళ్లరాదు. అయితే ఇక్కడ దానిని సేఫ్టీ కారు పాటించలేదు. అయితే తీవ్ర చర్చల అనంతరం మెర్సిడెస్‌ ఫిర్యాదును స్టీవర్డ్స్‌ తోసిపుచ్చి వెర్‌స్టాపెన్‌ను విజేతగా ప్రకటించారు.

Story first published: Monday, December 13, 2021, 13:16 [IST]
Other articles published on Dec 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X