న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'మరోసారి దేశం గర్వపడేలా చేశావ్'

Mary Kom Becomes Most Successful Boxer in World Championships History with Sixth Gold

న్యూ ఢిల్లీ: భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీకోమ్‌ మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. వరుసగా ఆరోసారి బంగారు పతకం నెగ్గిన ఈమె బాక్సింగ్‌ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన క్రీడాకారిణిగా నిలిచింది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన ఫైనల్లో 35 ఏళ్ల మేరీ కోమ్.. ఉక్రెయిన్‌ బాక్సర్ హన్నా ఒఖోటాను ఓడించి ఆరోసారి బంగారు పతకం చేజిక్కించుకుంది. 48 కేజీలో విభాగంలో పోటీపడిన మేరీ కోమ్.. ఫైనల్‌లో 5-0 తేడాతో విజయం సాధించి ఆరో బంగారు పతకం కొల్లగొట్టింది.

న్యూ ఢిల్లీలో భారత అభిమానుల మధ్యలో బంగారు పతకం గెలవడం మేరీ కోమ్‌కు ఇది రెండోసారి. గతంలో 2006లో న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మేరీ కోమ్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఆటపూర్తయిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడింది.

 స్వర్ణం తెలియని అనుభూతి కలిగిస్తోంది

స్వర్ణం తెలియని అనుభూతి కలిగిస్తోంది

‘నా ఈ పతకాన్ని దేశానికి అంకితం ఇస్తున్నా. నా బాధ్యతను మెరుగ్గా నిర్వర్తించానన్న సంతృప్తి ఇప్పుడు కలిగింది. నా ఆటకు మెరుగులద్దిన కోచ్‌లకు ధన్యవాదాలు. నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించిన మా కుటుంబ సభ్యులకు, మా సిబ్బందికి కృతజ్ఞతలు. నా సహ క్రీడాకారిణులకు శుభాభినందనలు. స్వర్ణం సాధించడం తెలియని అనుభూతి కలిగిస్తోంది' అంటూ ఉద్వేగంగా తెలిపింది.

ఆమె విజయం నిజంగా ప్రత్యేకం

‘భారతీయ క్రీడాలోకం గర్వించదగ్గ సమయం. ప్రపంచ ఛాంపియన్‌లో స్వర్ణం సాధించినందుకు శుభాభినందనలు మేరీకోమ్. ప్రపంచ క్రీడా వేదిక మీద భారత ఔన్నత్యాన్ని చాటినందుకు గర్విస్తున్నా. ఈమె విజయం నిజంగా ప్రత్యేకం' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కి మేరీ స్పందిస్తూ ‘ధన్యవాదాలు మోడీజీ.. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు' అని రిప్లై ఇచ్చారు.

ఆరింటిని గెలిచిన తొలి మహిళా బాక్సర్

48 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించిన మేరీ కోమ్‌కు అభినందనలు. ఆరు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా ఆమె నిలిచింది. అద్భుతమైన అథ్లెట్ సాధించిన గొప్ప ఘనత ఇది. మనందిరికీ ఎంతో గర్వకారణమైన రోజు ఇది.

దేశం గర్వపడేలా చేసింది: చంద్రబాబు

మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్ 2018లో ఆరో బంగారు పతకం సాధించిన చరిత్ర సృష్టించిన బాక్సర్ మేరీ కోమ్‌కు హృదయపూర్వక అభినందనలు. ఆమె దేశం గర్వపడేలా చేసింది.

సూపర్ హ్యాపీతో సూపర్ గర్వంగా

మేరీ కోమ్ సాధించిన అద్భుత ఘనత. ఆరో ప్రంపచ ఛాంపియన్‌షిప్ సాధించిన తొలి మహిళా బాక్సర్. భారత గొప్ప క్రీడాకారుల్లో ఈమె ఒకరు. సూపర్ హ్యాపీ, సూపర్ ప్రౌడ్!

లివింగ్ లెజెండ్‌కు కంగ్రాచ్చులేషన్స్:

రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచ ఛాంపియన్‌షిప్ గోల్డ్ సాధించి మరోసారి భారత్ గర్వపడేలా చేసిన లివింగ్ లెజెండ్ మేరీ కోమ్‌కు హృదయపూర్వక అభినందనలు.

Story first published: Sunday, November 25, 2018, 11:20 [IST]
Other articles published on Nov 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X