న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'తల్లి చేపలమ్మి.. తండ్రి దినసరి కూలి.. భారత్ నుంచి తొలి మహిళగా పతకం గెలిచి'

Manipur girl Thangjam Tababi Devi wins Indias first judoka medal

న్యూ ఢిల్లీ: యూత్‌ ఒలింపిక్స్‌లో జూడోలో పతకం సాధించి తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించింది 16 ఏళ్ల తబాబీ దేవి థంగ్జమ్. ఏ ఫార్మాట్‌లో చూసినా దేశం తరఫున ఈ ఆటలో పతకం గెలిచిన మొదటి వ్యక్తి ఆమె. అతి చిన్న వయసులో యూత్ ఒలింపిక్స్‌లో ఈ టీనేజర్.. వెండి పతకాన్ని భారత్‌కు అందించారు. ఏ స్థాయి అయినా సరే ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అనేది క్రీడాకారులకు కత్తిమీద సాము లాంటిదే. అయితే దేవీకి అది మరింత కష్టం.

దెబ్బలు తగలొచ్చు.. చదువుకో:

దెబ్బలు తగలొచ్చు.. చదువుకో:

ఎందుకంటే జూడో నేర్చుకునేందుకు తల్లిదండ్రులు దేవికి ఏ దశలోనూ సహకరించలేదు. అది మగపిల్లల ఆటగా మాత్రమే వారు చూశారు. దాంతో ఆమె ఈ ఆటను చాలా రహస్యంగా నేర్చుకుంది. ‘వారికి చెప్పకుండా రహస్యంగా ఈ ఆటను నేర్చుకున్నాను. దీని గురించి వారికి మొదట తెలిసి ఇంకోసారి ఆడొద్దని హెచ్చరించారు. నువ్వు ఈ ఆటను ఎక్కడ నేర్చుకుంటున్నావు, నీకు దెబ్బలు తగలొచ్చు, చదువుకో, ఇంకా ఏదైనా చేయి కానీ, ఇది మాత్రం వద్దు' అని కూడా వారించారు.

 చాలా సార్లు ఆపాలని ప్రయత్నించా

చాలా సార్లు ఆపాలని ప్రయత్నించా

ఇంకా ఆట కోసం తాను పడిన తపనను ఇలా వెల్లడించింది. ‘మా అమ్మనాన్న నన్ను చాలా సార్లు ఆపాలని ప్రయత్నించారు. కానీ దూరంగా పరిగెత్తేదాన్ని. వారికి కోపం వచ్చేది. కానీ నేను ఆటను ఎంతో ప్రేమించా. ముఖ్యంగా దానిలోని పోరాట స్ఫూర్తి నాకెంతో నచ్చుతుంది'అని దేవి వెల్లడించింది. మణిపూర్‌కు చెందిన దేవి యూత్ ఒలింపిక్స్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది.

స్నేహితులతో చిన్నచిన్న పోరాటాలు

స్నేహితులతో చిన్నచిన్న పోరాటాలు

‘వీధిలో స్నేహితులతో చిన్నచిన్న పోరాటాలు చేసేదాన్ని. కానీ ఎక్కడో నాకు శక్తి సరిపోవడం లేదని గ్రహించి జూడో నేర్చుకున్నా. దాంతో ఎవరు పోటీ పడటానికి వచ్చేవారు కాదు. చివరికి యువకులు కూడా' అని సంతోషంగా ఆమె సాధించిన విజయాన్ని వెల్లడించింది. ఈ విజయంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. విజయం తరువాత కుటుంబ సభ్యులు వంద శాతం ఆమెకు మద్దతు పలికారు.

పిల్లలు కూడా అలాగే కావాలని

పిల్లలు కూడా అలాగే కావాలని

‘భారత్‌లో పేదరికంలో మగ్గుతున్న అనేక ప్రాంతాల్లో ఇలాంటివి చాలా సహజం. ఆటకోసం తల్లిదండ్రులను ఎంతో ఒప్పించాల్సి ఉంటుంది. దేవీలాగా విజయం సాధించగానే అందరి తల్లిదండ్రులు తమ పిల్లలు కూడా అలాగే కావాలని కోరుకుంటారు' అని ఆమె కోచ్‌ అభిప్రాయపడ్డారు. యూత్ ఒలింపిక్స్‌ అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ వేదికగా జరుగుతున్నాయి.

Story first published: Tuesday, October 9, 2018, 15:06 [IST]
Other articles published on Oct 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X