న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అథ్లెట్‌ కిరణ్‌జీత్‌పై నాలుగేళ్ల నిషేధం!!

Kiranjeet Kaur handed four-year ban after being tested positive for doping

న్యూఢిల్లీ: భారత మహిళల లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ కిరణ్‌జీత్‌ కౌర్‌పై ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) వేటు వేసింది. నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు రుజువు కావడంతో ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది కోల్‌కతా 25కె రేసు సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో కిరణ్‌జీత్‌ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు రుజువైంది. బి శాంపిల్‌ కూడా పాజిటివ్‌గా తేలడంత.. 32 ఏళ్ల కౌర్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ వాడా శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

ధోనీ విన్నింగ్ షాట్.. సంగక్కర చిరునవ్వులో వెలకట్టలేని బాధ!!ధోనీ విన్నింగ్ షాట్.. సంగక్కర చిరునవ్వులో వెలకట్టలేని బాధ!!

హరియాణాకు చెందిన కిరణ్‌జీత్‌ కౌర్‌ గతేడాది డిసెంబరులో జరిగిన టాటా స్టీల్‌ కోల్‌కతా 25కె రేసులో స్వర్ణం సాధించింది. తాజా నిర్ణయంతో ఆమె నుంచి స్వర్ణాన్ని వెనక్కి తీసుకోనున్నారు. ఆమెపై నిషేధం నిరుడు డిసెంబరు 15 నుంచి మొదలుకానుంది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఆమె శాంపిల్‌ ఎ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది.అయితే దోహాలో నిర్వహించిన బి శాంపిల్‌ పరీక్షలో కూడా పాజిటివ్‌ రావడంతో ఆమెపై వేటు తప్పలేదు.

కిరణ్‌ గతేడాది మార్చిలో పటియాల వేదికగా జరిగిన ఫెడరేషన్‌ కప్‌ జాతీయ అథ్లెటిక్స్‌లో 10వేల మీటర్ల రేసులో కాంస్యం సాధించింది. నిరుడు డిసెంబరు 15న కోల్‌కతాలో జరిగిన టాటా స్టీల్‌ 25 కిలోమీటర్ల పరుగులో కిరణ్‌జీత్‌ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా 11వ స్థానంలో నిలిచిన ఆమె.. భారత క్రీడాకారిణుల్లో ప్రథమ స్థానం సాధించింది.

Story first published: Saturday, May 30, 2020, 10:08 [IST]
Other articles published on May 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X