విమానాశ్రయంలో ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం: గోస్వామి

బెంగాల్: శిక్షణ కోసం వెళుతున్న తనను విమానాశ్రయ అధికారులు అకారణంగా ఆపి నేరస్తురాలిలా చూశారని భారత యువ షూటర్‌ మను బాకర్‌ ఆరోపించారు. భోపాల్‌ వెళుతుండగా 19 ఏళ్ల మనును ఢిల్లీ విమానాశ్రయంలో అడ్డుకున్న అధికారులు రూ.10,200 జరిమానా విధించారు. తుపాకులు తీసుకెళ్లేందుకు తన దగ్గర అన్ని అనుమతి పత్రాలూ ఉన్నా కూడా సిబ్బంది వినలేదన్నారు. కేంద్ర క్రీడల మంత్రి కిరెన్‌ రిజిజు, విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరికి ట్విటర్‌ ద్వారా ఆమె ఫిర్యాదు చేశారు.

అయితే మను బాకర్‌ ట్విట్లకు వెంటనే స్పందించిన మంత్రులు కిరెన్‌ రిజిజు, హర్‌దీప్‌సింగ్‌ పూరి ఆమె వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. సందర్భంగా రిజిజు, హర్‌దీప్‌కు కృతజ్ఞతలు తెలిపిన బాకర్‌.. విమానాశ్రయ అధికారులు క్రీడాకారులను గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ అవమానించొద్దని పేర్కొన్నారు. ఈ ఘటనపై జులన్ గోస్వామి, ధన్రాజ్ పిళ్లే, హరేంద్ర సింగ్ హ్యారీలు స్పదించి మనుకు మద్దతుగా నిలిచారు.

'ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం, కానీ ఎయిర్ ఇండియాతో ఉద్యోగిగా మరియు ప్రయాణీకురాలిగా నా అనుబంధం చాలా గొప్పది. క్రీడలు మరియు క్రీడాకారులకు గౌరవం చూపించడానికి ఎయిర్ ఇండియా ఎల్లప్పుడూ బెంచ్ మార్కును నిర్దేశిస్తుంది' అని భారత క్రికెట్ మహిళా జట్టు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి ట్వీట్ చేశారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ మద్దతు ఇచ్చే సంస్థలలో ఎయిర్ ఇండియా ఒకటని హరేంద్ర సింగ్ పేర్కొన్నారు.

'ఒక కథకు ఎల్లప్పుడూ రెండు వైపులు ఉంటాయని గుర్తుంచుకోండి. రెండు దశాబ్దాలుగా ఒలింపియన్ మరియు ఎయిర్ ఇండియా కుటుంబంలో గర్వించదగిన సభ్యునిగా ఉన్నాను. క్రీడాకారులకు ఎల్లప్పుడూ మద్దతునిచ్చే సంస్థపై నేను చాలా గర్వపడుతున్నా' అని హాకీ లెజెండ్ ధన్రాజ్ పిళ్లే ట్వీట్ చేశారు.

Australian Open 2021: మహిళల సింగిల్స్‌ ఫైనల్స్ నేడే.. గెలిచేది ఎవరు?

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, February 20, 2021, 12:10 [IST]
Other articles published on Feb 20, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X