న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెజె ఆన్‌ ఫైర్‌ : వీరికి ఈ దఫా చాన్స్‌ మిస్‌

By Pratap

చెన్నై: చెన్నైయిన్‌ ఎఫ్‌సిలో స్టార్‌ స్ట్రైకర్‌ జెజె లాల్పెఖులౌ పేరు మారుమోగుతున్నది. ఐఎస్‌ఎల్‌లో డిపెండింగ్‌ చాంపియన్‌ చెన్నైయిన్‌.. తమ జట్టు ప్రచారం కోసం సహచర ఆటగాడి పేరుపైనే పాటను రూపొందించింది. జట్టు యాజమాన్యం తీరుతో ఆశ్చర్యపోవడం జెజె వంతైంది. దీనికి కారణం ప్రస్తుతం ఆయన ఫుల్‌ స్వింగ్‌ ఫామ్‌లో ఉండటమే. ఇది యూరప్‌లో ప్రజాదరణ పొందిన పాట కూడా.

ఐఎస్‌ఎల్‌ చెన్నైయిన్‌ ఫ్రాంచైసీతో రెండేళ్లు ఆడేందుకు 2015లో ఒప్పందం చేసుకున్న జెజె.. రెండో సీజన్‌లో మెరుపులు మెరిపించాడు. సెమీ ఫైనల్స్‌లో తొలి గోల్‌తోపాటు మొత్తం ఆరు గోల్స్‌ సాధించిన జెజె.. క్రితంసారి 'సీజన్‌ ఆఫ్‌ ది ప్లేయర్‌' అవార్డు అందుకున్నాడు.

తొలి సీజన్‌లోనూ చెన్నై జట్టు తరఫున తాత్కాలిక ప్రాతిపదికన ఆడిన జెజె.. పుణె సిటీపై జట్టు 3 - 1 స్కోర్‌ తేడాతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగు గోల్స్‌ సాధించి.. ఐఎస్‌ఎల్‌లో ఇండియన్‌ ప్లేయర్లలో మొదటివాడిగా నిలిచాడీ మిజోరం కుర్రాడు.

 Jeje Lalpekhlua

ఫౌల్స్‌ ఎక్కువ.. గోల్స్‌ తక్కువ

ఐఎస్‌ఎల్‌ మూడో సీజన్‌లో సుమారు 28 మంది ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఎఫ్‌సి గోవా తరఫున ఆడిన విక్టోరినో ఫెర్నాండెజ్‌.. ఫార్వర్డ్‌ క్రీడాకారుడైనా.. సీజన్‌లో ఒకేఒకసారి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. అదే సమయంలో ఐదు ఫౌల్స్‌ నమోదయ్యాయి.

పుణె సిటీ నుంచి ఆడిన గోవిన్‌సింగ్‌ మైరాంగ్‌థెమ్‌ ఐదు మ్యాచ్‌లుడి 10 ఫౌల్స్‌ చేయడమే కాదు రిఫరీ నుంచి రెండుసార్లు హెచ్చరికలు అందుకోవాల్సి వచ్చింది. కొట్టాయం కుర్రాడు జస్టిన్‌ స్టీఫెన్‌ గత ఏడాది చెన్నైయిన్‌ తరఫున ఒక మ్యాచ్‌లో మాత్రమే పాల్గొన్నాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ముంబై సిటీ ఎఫ్‌సి మిడ్‌ ఫీల్డర్‌ సంపత్‌ కుట్టిమణి రెండు ఐఎస్‌ఎల్‌ సీజన్లలో మూడు మ్యాచ్‌ల్లోనే ఆడాడు. ఒక గోల్‌చేస్తే రెండుసార్లు ఫౌల్స్‌ చేశాడు. చెన్నైయిన్‌ ఎఫ్‌సి తరుఫున ఆడిన మరో ప్లేయర్‌ బల్వంత్‌సింగ్‌ తొలి సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడితే.. గత ఏడాదికొచ్చేసరికి ఆరు మ్యాచ్‌ల్లోనే పాల్గొన్నారు. ఐఎస్‌ఎల్‌లో తొలిసారి గోల్‌చేసిన ఫార్వర్డ్‌గా రికార్డు ఉన్నా.. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.

ఎఫ్‌సి గోవాకు చెందిన క్లిఫ్ఫోర్డ్‌ మిరాండియా ఇద్దరు సహకారంతో తొలి ఐఎస్‌ఎల్‌ సీజన్‌లో ఐదు షాట్లు కొట్టిన తర్వాత గోల్‌చేయగలిగాడు. కానీ ఆయన ఖాతాలో 13 ఫౌల్స్‌ నమోదయ్యాయి. మిడ్‌ ఫీల్డర్‌గా ఉన్న మిరాండియా.. ప్రత్యామ్నాయంగా అట్లెంటికో డీ కోల్‌కతాలో ఆడాడు. మరో ఎఫ్‌సి గోవా ఆటగాడు ఎనిమిది షాట్లలో ఒక్కదాన్ని మాత్రమే గోల్‌గా మలిచాడే గానీ ఆయనకు రిఫరీ ఎల్లో కార్డు చూపడం గమనార్హం.

ఇండియన్‌ లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన సుశీల్‌కుమార్‌ సింగ్‌.. 2014, 2015 ఐఎస్‌ఎల్‌ సీజన్లలో ఐదేసీ మ్యాచ్‌లు ఆడినా చేసింది ఏకైక గోల్‌ మాత్రమే. పుణె సిటీ ప్లేయర్‌ జోవాక్వామ్‌ అబ్రాంచెస్‌.. 2014లో ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆడినా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఐదు షాట్లు కొట్టాల్సి వచ్చింది. దీనికి తోడు పలు సార్లు ఫౌల్స్‌కు పాల్పడ్డాడు. రోవిల్‌సన్‌ రోడ్రిగ్స్‌.. ముంబై సిటీ ఎఫ్‌సి, ఎఫ్‌సి పుణె తరపున ఆడిడా .. గతేడాది ఒక గోల్‌ కొడితే నాలుగు ఫౌల్స్‌కు పాల్పడ్డాడు.

సొంత గడ్డపై వసతుల్లేని గోవా

బ్రెజిల్‌లో ప్రీ - సీజన్‌ శిక్షణ ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ఐఎస్‌ఎల్‌ ఫ్రాంచైసీ.. ఎఫ్‌సి గోవా.. ప్రస్తుతం ప్రాక్టీస్‌కు అవసరమైన గ్రౌండ్‌ కోసం ఆందోళన చెందుతోంది. తొలుత సీసా ఎఫ్‌ఎ గ్రౌండ్‌లో శిక్షణ పొందొచ్చని భావించినా. దానిపై అక్కడక్కడా గుంతలున్నాయి.

ఇక వచ్చే మూడు రోజులు ప్రాక్టీస్‌ కోసం ఎఎఫ్‌సి యు - 16కు రిజర్వుచేసిన నాగోవా గ్రౌండ్‌కు బుక్‌ చేసుకున్నా.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పూర్తిగా బురదమయమైంది. దీంతో ఆదివారం ప్రాక్టీస్‌ను ఎత్తేసినట్లు కోచ్‌ మౌరిసియో అఫాన్‌సో ప్రకటించాల్సి వచ్చింది. వాస్కోలోని తిలక్‌ మైదాన్‌, బాంబోలియంలోని జీఎంసీ స్టేడియం, ఫటోర్డాలోని నెహ్రూ స్టేడియం ప్రస్తుతం ఎఎఫ్‌సి యు - 16 చాంపియన్‌షిప్‌, తర్వాత బ్రిక్స్‌ కప్‌ ప్రాక్టీస్‌ కోసం కేటాయించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:23 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X